Wednesday, 11 June 2014

రూపాయి చరిత్ర:::::::::::::::The history of Indian Rupee


రూపాయి (Indian Rupee) భారత అధికారిక మారక ద్రవ్యం. రూపాయి చెలామణీని భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది. ISO 4217 పద్ధతి ప్రకారం రూపాయి గుర్తు INR. సంస్కృత పదమైన రూప్యకం (అనగా "వెండి నాణెం") నుండి రూపాయి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపాయిని రూపాయి, రూపీ, రుపయ్యా అని పలుకుతారు. అస్సామీ, బెంగాలీ భాషల్లో మాత్రం రూపాయిని టాకా అని పిలుస్తారు. రూపాయికి వంద పైసలు.

రూపాయి చరిత్ర:::::::::::::::

నాణేలు చెలామణీ చెయ్యడంలో భారత్ కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. (క్రీ.పూ. 6 వ శతాబ్దం) రూపాయిని మొదటి సారిగా షేర్‌షా సూరి ప్రవేశపెట్టాడని భావిస్తున్నారు. ఆ రూపాయికి 40 రాగి నాణేల విలువ ఉండేది. ఇక రూపాయి కాగితాలను మొదటగా ముద్రించినవారు "బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్" (1770-1832), "జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్" (1773-75), (వారన్ హేస్టింగ్స్ స్థాపించాడు), బెంగాల్ బ్యాంక్ (1784-91).
ఆధునిక కాలంలో, మొదట్లో రూపాయి అంటే ఓ వెండి నాణెం. 19 వ శతాబ్దంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలు బంగారంపై ఆధారపడి ఉండేవి. ఆ సమయంలో అమెరికా లోను, ఇతర ఐరోపా ఆక్రమిత దేశాల్లోను అపారమైన వెండి నిల్వలను కనుక్కున్నారు. దాంతో, బంగారంతో పోలిస్తే వెండి విలువ పడిపోయింది. హఠాత్తుగా రూపాయి కొనుగోలుశక్తిని కోల్పోయింది. ఈ ఘటనను "రూపాయి పతనం" గా పిలుస్తారు.
బ్రిటిషు వారి కాలంలో రూపాయికి 16 అణాలు. ఒక్కో అణాకు 6 పైసలు లేదా 12 పై లు. 1815 వరకు, మద్రాసు ప్రెసిడెన్సీ ఫానం అనే ద్రవ్యాన్ని చెలామణీ చేసేది. 12 ఫానంలు ఒక రూపాయికి సమానం.
స్వాతంత్ర్యానికి ముందు తిరువాన్కూరు రూపాయి, హైదరాబాదు రూపాయి, కచ్ కోరీ.. ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ ద్రవ్యం ఉండేది. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక, వీటన్నిటినీ తీసివేసి భారత రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు.
1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించి, ఈ పైసలను నయా (హిందీలో "కొత్త") పైసలు గా పిలిచారు. తరువాతి కాలంలో నయా అనేది మరుగున పడిపోయింది. "డేనిష్ ఇండియన్ రూపాయి"ని 1845 లోను, 1954 లో "ఫ్రెంచి ఇండియన్ రూపాయి"ని, 1961లో "పోర్చుగీసు ఇండియన్ ఎస్కుడో"ను తొలగించి ఆ స్థానంలో భారత రూపాయిని ప్రవేశపెట్టారు.

అంతర్జాతీయంగా రూపాయి::::::::::::::::::

దేశవిభజన తరువాత మొదట్లో పాకిస్తాను భారత రూపాయినే వాడేది; దానిపై పాకిస్తాను ముద్ర వేసుకునేవారు. గతంలో కువైట్, బహ్రెయిన్, కతర్, యు.ఎ.ఇ, మలేసియా లలో కూడా భారత రూపాయినే అధికారిక ద్రవ్యంగా వాడేవారు. దేశం బయట చెలామణీ కోసమై, ప్రత్యేకంగా గల్ఫ్ రూపీని 1959 మే 1 నాటి చట్టసవరణ ద్వారా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బంగారం దొంగరవాణా ద్వారా దేశ విదేశీ మారక ద్రవ్యంపై వస్తున్న వత్తిడిని తగ్గించందుకు గాను ఈ చర్య తీసుకున్నారు. 1966 జూన్ 6 న భారత్ తన ద్రవ్య విలువను తగ్గించినపుడు అప్పుడు గల్ఫ్ రూపీని వాడుతున్న ఒమన్, కతర్, ఇప్పటి యు.ఎ.ఇ లోని దేశాలు గల్ఫ్ రూపీ స్థానంలో తమ తమ ద్రవ్యాలను ప్రవేశపెట్టాయి. కువైట్ 1961 లోను, బహ్రెయిన్ 1965 లోను ఆ పని చేసేసాయి.
నేపాల్ లో భారత్ సరిహద్దుకు దగ్గరి పట్టణాల్లో భారత రూపాయిని తీసుకుంటారు. ఇంగ్లండు లోని కొన్ని భారతీయ దుకాణాల్లో కూడా రూపాయిని తీసుకుంటారు.

ప్రస్తుతం చెలామణీలో ఉన్న నోట్లు 5, 10,20, 50, 100, 500, 1000. 1996 లో ప్రవేశపెట్టిన ప్రస్తుత నోట్ల శ్రేణిని మహాత్మా గాంధీ శ్రేణి అంటారు.

అన్ని నోట్లూ, నాణేలను భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది. ప్రస్తుతం చెలామణీలో లేని 1 రూపాయి నోట్లను మాత్రం భారత ప్రభుత్వం జారీ చేసేది. ప్రతీ నోటు మీదా దాని విలువ 17 భారతీయ భాషల్లో ముద్రించి ఉంటుంది.
నాణేలన్నిటినీ భారత ప్రభుత్వ మింటు యొక్క నాలుగు మింట్లలో ముద్రిస్తారు. నోట్లను నాసిక్, దేవాస్, సల్బోని, మైసూరు, హోషంగాబాదు లలో ముద్రిస్తారు.

భాషలు::::::::::::

రూపాయల నోట్ల మీద ఆ నోటు విలువ అన్ని జాతీయ భాషల లోను ముద్రించి ఉంటుంది.
భద్రత, స్పర్శ అంశాలు:::::::


స్పర్శాంశాలు:::
నిరక్షరాస్యులు కూడా తేలికగా తెలుసుకునేలా, చూపులకు, స్పర్శకు తెలిసిపోయే కొన్ని అంశాలను వివిధ ద్రవ్య నోట్లలో పొందుపరచారు.

పరిమాణం — నోట్లూ, నాణేలు వేరువేరు పరిమాణాల్లో ఉంటాయి.
రంగు — వివిధ నోట్లు వేరువేరు రంగుల్లో ఉంటాయి.
ఉపరితలం — అధిక విలువ కలిగిన పెద్ద నోట్లపై వాటి విలువ, మరి కొన్ని ఇతర అంశాలు ఉబ్బెత్తుగా (emboss) ముద్రించబడి ఉంటాయి. అలాగే, దృష్టిదోషం కలవారికి వీలుగా వాటరు మార్కుకు స్థలానికి ఎడమ వైపున వివిధ జామెట్రీ బొమ్మలు (త్రికోణం, చతురస్రం వగైరా) ముద్రించబడి ఉంటాయి.
భద్రతాంశాలు:::;::::::: వాటరుమార్కు — నోట్లపై గల తెల్లటి స్థలంలో మహాత్మా గాంధీ వాటరు మార్కు ఉంటుంది. భద్రతా తీగ — అన్ని నోట్లకు వెండి రంగులో ఒక భద్రతా తీగ, కొన్ని రాతలతో సహా ఉంటుంది. నోటును కాంతికి ఎదురుగా పెట్టుకుని చూస్తే ఈ రాతలు కనిపిస్తాయి. లేటెంటు బొమ్మ — పెద్ద నోట్లను కంటికెదురుగా, భూమికి సమాంతరంగా పెట్టుకుని చూస్తే అంకెల్లో నోట్ల విలువ కనిపిస్తుంది. సూక్ష్మాక్షరాలు — భద్రతా దారానికి, వాటరుమార్కుకు మధ్య నోటు విలువ అంకెల్లో ముద్రించి ఉంటుంది. భూతద్దం పెట్టి చూస్తేనే ఇది కనిపిస్తుంది. ఫ్లోరసెన్సు — అంకెల పలకలు అల్ట్రా వయొలెట్ కాంతి పడినపుడు ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాంతికనుగుణంగా రంగు మారే సిరా — 500, 1000 నోట్లపై అంకెలు కాంతిని బట్టి రంగు మారే సిరాతో రాయబడి ఉంటాయి. నోటును చదునుగా పెట్టి చూస్తే ఆకుపచ్చగాను, కొంత కోణం నుండి చూస్తే నీలంగాను కనిపిస్తుంది. ముందూ వెనకా కలిసే బొమ్మ — నోటును కాంతి కెదురుగా ఉంచి చూసినపుడు నోటుపై ముందు, వెనుకల ఉండే పూల డిజైన్లు ఒకదానికొకటి కలిసిపోయి కనపడతాయి

Post a Comment

Whatsapp Button works on Mobile Device only