నేను సాధారణంగా సెలూన్ షాపు కు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వారితో మాటలు కలుపుతాను...
నాకు ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు (రిలేషన్స్) ఏర్పరచుకోవాలనే ఆపేక్ష ఎక్కువ!!!
ఈ మాటల సందర్భంలో ఆ మంగలి నాతో
“అయ్యా!! ఈ ప్రపంచంలో నిజంగా దేవుడు లేడండీ... ఉంటే నాకు కనపడే వాడు కదా??? ఇంత వరకు నేను అతన్ని చూడలేదు... ఆయన నాకు కనపడలేదు... అతను నాకేమీ చేయలేదు!! అంతా నా కాయ కష్టంతో నేనే నడుపుకొనుచున్నాను!! అందుకే నేను దేవుణ్ణి నమ్మను!! ” అన్నాడు.
దానికి నేను వీడితో వాదన ఎందుకులే అని ఆగి పోయాను... క్షవరం అయి పోయింది..
నేను బయటకు వెళ్దామని వెళ్ళబోయాను.. నాకు ఎదురుగా ఒక పిచ్చి ముష్టి వాడు చింపిరి జుట్టుతో..
బాగా పెరిగిన జుట్టు, గడ్డంతో కనిపించాడు... వెంటనే నాకు ఒకటి స్ఫురించింది.. వెంటనే బార్బరు షాపు కు వెళ్ళి మంగలితో...
“బాబూ!! ఈ లోకంలో మంగలి షాపులే లేవు... మంగలి వాళ్ళే లేరు అని అన్నాను”...
అతను కొంచెం ఆశ్చర్య పోయాడు... “ఏంటి సార్! ఇప్పుడే కదా నేను మీకు క్షవరం చేసాను.. ఇది బార్బర్ షాపే కదా.. మీరెందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు” అన్నాడు!!
ఓకే!! నీవు నిజం.. నీ షాపు నిజం అయితే.. లోకంలో జుట్టు పెరిగిన వాళ్ళే ఉండకూడదు కదా!! ఈ బిచ్చగాడిని చూడు ఎంత జుట్టు పెరిగిందో అన్నాను..
నేను ఏం చెప్పదలచుకొన్నానో ఆ మంగలికి అర్థం అయ్యింది... కానీ బింకంగా వాడు మాదగ్గరికి రాకపోతే మేము ఏం చేయగలం సార్!! అన్నాడు..
సరే వాడిని అడిగి చూడు ఏం చెపుతాడో విను.. అవసరమయితే నేను డబ్బులిస్తా అని చెప్పాను...
ఆ మంగలి ఆ భిక్షగాడిని పిలిచి .. బాబూ నీకు గడ్డం గీసి క్షవరం చేస్తా వస్తావా!! అని అడిగాడు..
దానికి ఆ భిక్షగాడు... అయ్యా! నాకు ఇలాగే బావుంది.. నాకు నలుగురు నాలుగు రూపాయలు ఏస్తున్నారు!! నాకు ఇదే బావుంది.. నన్ను వదిలేయండి అని అరిచి పారిపోయాడు!!... ఆ మంగలికి అర్థం అయింది..
తాను చేసిన తప్పేమిటో... నేను వెంటనే... ఆ మంగలితో... దేవుడు అందరికీ ప్రత్యక్షమవ్వాలని లేదు.. మనకి దేవుని చూడాలి అని అనిపిస్తే చాలు ఏదో రూపంలో మనకు సాక్షాత్కరిస్తాడు.. అంతే కానీ మన దగ్గరకు వచ్చి తాను దేవుణ్ణని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు... మన శ్రమను నమ్ముకోవాలి.. దానికి తోడుగా ఆ భగవంతుని కృప ఉంటే మనం తప్పు దారి పట్టే టపుడు సరియైన దారిలోనే వెళ్ళే విధంగా మనకు సాయ పడతాడు... తన తోడ్పాటునందిస్తాడు... అని చెప్పాను..
ఈ లోపులో ఒక ఎన్నారై మిత్రుడు కూడా ఒకరు అక్కడ తటస్థించారు.. మా సంభాషణ అంతా అతను విన్నాడు.. అస్సలు ఏం జరుగుతుందో అని కాకుండా.. తాను మంగలి కి సపోర్ట్ చేసి మాట్లాడుదాం అని...
చూడు సోదరా! అయితే నేను అమెరికాలో చాలా బాగా సంపాదించాను కదా! అది కూడా నా కష్టమే కదా! ఇక్కడ నా కు కూడా దేవుడు కనిపించలేదు...
నాకు ఆ వివరణ సరిపోలేదు.. ఇంకా కావాలి అన్నాడు... (ఆ మంగలి కళ్ళూ మెరవడం గమనించాను... )
నేను '' సరే అమెరికాలో నీవు ఒబామాను ఎప్పుడైనా చూసావా?? ``అని అడిగాను..
దానికి లేదు అన్నాడు.. సరే అమెరికా అంతా ఆయన అడుగు జాడలు/ విధానాల ద్వారానే కదా నడిచేది అని అడిగాను... అవునన్నాడు నా మిత్రుడు... అయితే నీవు చూడని వ్యక్తే ఇవన్నీ చేస్తున్నాడంటే ఎలా నమ్ముతున్నావు అని అడిగాను...నా మిత్రునితో... దానికి సమాధానం లేదు అతని దగ్గర... నేను వెంటనే .. భగవంతుడు.. కొన్ని ధర్మాలను, న్యాయాలను, లోకంలో నడిచేవిధంగా చూస్తూ ఉంటాడు.. దానివలననే ఈ లోకం అంతా నడుస్తూ ఉంటుంది... ఆయన కనపడడం లేదని.. లేడనుకోవద్దు.. అని చెప్పాను. అర్థమయినట్లు తలూపారు.. మంగలి మరియు ఎన్నారై మిత్రుడు... చాలా మందికి మానసిక ప్రశాంతత దూరమవ్వడానికి కారణం ప్రతి పనీ తామే చేస్తున్నామని ఫీల్ కావడమేనని సైకాలజిస్టుల సర్వేలలో తేలింది.. అందుకే మన పూర్వీకులు ఏ పని చేసినా దైవమే తమను నడిపిస్తున్నాడని ఫీల్ అవుతూ చేయమనేవారు.. ఇక్కడ తప్పు చేసే టపుడు.. దైవమైతే తప్పు చేయడు కదాఅని తప్పులు చేసే అవకాశం తగ్గి పోతుంది... ఒక వేళ ఏదో దురదృష్టవ శాత్తు అనుకోనిది సంభవించినప్పుడు.. దేవునకు ఈ పని సంభవించడం ఇష్టంలేదు లాగా ఉంది.. అందుకే కావడం లేదు.. మరోలా చేద్దామని సంకల్పించేలా చేసి.. ఒక పనిని చాలా విధాలుగా చేయడం మనకు నేర్పుతాడు.. అనే భావన వస్తుంది.. ఒకవేళ అన్ని ప్రయత్నాలలో విజయం సాధించేటప్పుడు.. విజయగర్వం లేకుండా ముందుకు సాగి పోయేలా చేస్తుంది.. అందుకే మనం చేసే ప్రయత్నం మనం చేయాలి.. ఫలితం మాత్రం భగవంతునకు వదిలేయాలి!!!
పైన కథ అంతా వేర్వేరు పాత్రల మధ్య జరిగింది..
ఇది నా నిజ జీవితంలో జరిగింది కాదు..
వేర్వేరు వ్యక్తుల అనుభవాల నుండి వచ్చింది ..
నేను కథనం కోసం నా అనుభవ రూపంలో వివరించాను...
nice sir
ReplyDeletevery beautiful narration sir.. keep it up.
ReplyDeletethank you
Deleteబాగుంది
ReplyDeleteGOOD ACTIVITY
ReplyDelete