Friday 20 June 2014

అశ్వమేథ యాగమంటే ఏమిటి??

అశ్వమేథ యాగం

అశ్వమేధ యాగం వేద కాలంనుండీ వస్తున్న రాజ సంప్రదాయాలలో అతి ముఖ్యమైనది.
ఈ యాగం వివరంగా యజుర్వేదంలో వివరిం చారు.
ఋగ్వేదములో గుర్రపు బలి గురించి కొంత ప్రస్తావన ఉన్నా యజుర్వేదంలో చెప్పినం త వివరంగా చెప్పలేదు. గాయత్రీ పరివార్ 1991 నాటి నుండీ జంతు బలి లేకుండా, అశ్వ మేధ యజ్ఞాన్ని ఆధునిక శైలిలో నిర్వహిస్తున్నారు. 

అశ్వమేధ యాగాన్ని కేవలం రాజవంశానికి చెం దిన వారు మాత్రమే చేయాలి.
అశ్వమేధ యాగాన్ని కేవలం రాజవంశానికి చెం దిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం రాజ్యంలో శాంతి స్థాపన, మరియు రాబోయే కాలంలో తమ రాజ్యంపై దండయాత్ర చేయగల అవకాశమున్న రాజ్యాలను ముందే గుర్తించి వారిని ఓడించి అపార ప్రాణ నష్టాన్ని కలుగకుండా నివరించడం. 

ఈ యాగంలో దృఢంగా ఉండే మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేసాక, ఋత్వి కులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు. ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాల ను ఇస్తూ, ఒక కుక్కను చంపి సంకేతికంగా శిక్షను తెలియచేస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని ఒక సంవత్సరకాలం (కొంతమంది అర్థ సంవత్సర కాలమని చెపుతారు) యధేచ్చగా తిరగ డనికి ఈశాన్య దిశగా వదిలేస్తారు. ఈ గుర్రాన్ని సూర్యునితోనూ, సూర్యుని సాంవత్సరిక గమన ము తోనూ పోలుస్తారు. అశ్వం శత్రు రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రు రాజ్యాన్ని ఆక్ర మించుకుంటాడు. అంటే ఈ గుర్రం ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం యాగం నిర్వహించే రాజు పరమయినట్లే... గుర్రాన్ని ఆప చూసే వారు, దానిని చంపి తమ రాజ్యాన్ని కాపాడాలనుకునే వారిని ఎదుర్కోవడానికి /గుర్రాన్నికాపాడడానికి తోడుగా రాజ కుమా రులు కాని సేనాధిపతులు గాని ఉంటారు. 

ఈ గుర్రం తిరిగే కాలంలో నిర్వాహకుని ఇంట్లో యజ్ణ యాగాదులు జరుపుతారు. గుర్రం తిరిగి వచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. మరి మూడు గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి కాడి వేసి కట్టి ఋగ్వేదాన్ని పఠిస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని స్నానమాడించి, మహారాణీ, పరిచారికలు గుర్రాన్ని నేతితో అభ్యంగనమాచరి స్తారు. మహారాణి ముందు కాళ్ళను, పరిచారి కలు కడుపు భాగాన్ని, వెనుక కాళ్ళను అభ్యం గనమాచరిస్తారు. అశ్వము తల, మెడ, తోకలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. నిర్వాహ కుడు గుర్రానికి నైవేద్యాన్ని సమర్పిస్తాడు. ఆ తర్వాత గుర్రాన్ని, ఒక కొమ్ములులేని మగ మేకను, ఒక అడవి బర్రెని అగ్ని గుండానికి దగ్గర గా బలి పీఠానికి కట్టి వేస్తారు. ఇంకా 17 జంతు వులను గుర్రానికి కడతారు. 
చాలా పెంపుడు, అడవి జంతువులను (ఒక వ్యాఖ్యాత ప్రకారం మొత్తం 609 జంతువులు) వేర్వేరు బలి పీఠాలకు కట్టి వేస్తారు అప్పుడు ఆ గుర్రాన్ని బలి చేస్తారు. 

Courtesy: సూర్య న్యూ పేపర్

Post a Comment

Whatsapp Button works on Mobile Device only