Thursday, 19 June 2014

నిజ జీవితంలోని ఆందోళనలు తగ్గుంచుకుంటూ.. తన జబ్బు నుండి బయట పడిన నార్మన్ కజిన్స్ యొక్క విజయ రహస్యం... ఈ నిజజీవిత కథ-Inspirational real life stories

ఒక యథార్థ గాథ:
చాలా రోజుల క్రితం నార్మన్ కజిన్స్ అనే అతనికి ఒక జబ్బు వచ్చింది.... 
ఈ జబ్బు వచ్చిన వారిలో ఐదు వందల మందిలో ఒకరికి కూడా జీవించి ఉండే అవకాశం లేదు... 
అంత తీవ్రమైన జబ్బు అది.. ఈ మాట విన్న అతను చాలా దిగులు పడ్డాడు.. బాధపడ్డాడు.. 
ఒక్క సారిగా కోపం వచ్చింది.. తను జీవితంలో ఎంతో మందికి సాయం చేసాడు.. ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలిచాడు.. భగవంతుడు తనకెందుకింత శిక్షవేసాడో అర్ధం కాలేదు.. ఈ దిగులుతో మళ్ళీ మంచం పట్టాడు.. ఇప్పుడు డాక్టర్ ఇతన్ని పరీక్షించి ‘సార్!! మీకు వచ్చిన వ్యాధి వలన మీరు దిగులు పడితే ఆ వ్యాధి మరింత తీవ్రమవుతుంది... దిగులు పడడం మానేయండి!!” అని చెబుతాడు... 
కానీ నార్మన్ కు ఎలా బయట పడాలో అర్థం కాదు. ఆ రోజంతా నిద్ర పట్టలేదు... కానీ ప్రొద్దున్నే న్యూస్ పేపర్ లో వచ్చిన చిన్న ఆర్టికల్ చాలా నవ్వు తెప్పిస్తుంది.. పడీ పడీ నవ్వుతాడు... ఆ తర్వాత అతనికి అర్థం అవుతుంది... నవ్వడం వలన తనలో తేలిక దనం వచ్చిందని... 

ఇక్కడ నార్మన్ కు ఒక విషయం అర్థమవుతుంది... అంటే దిగులు వల్ల నెగటివ్ సమస్య అయితే .. సంతోషం వలన పాజిటివ్ ఫలితాలు వస్తాయి అని ... ఇక ఆ రోజు నుండి అన్నిరకాల హాస్య సినిమాల రీళ్ళు (అప్పటికింకా వి.సి.పి. లు రాలేదు) అద్దెకు తెచ్చుకుని చూడడం ప్రారంభించాడు... అందరి మిత్రులకు ఫోన్ చేసి తమకు ఎదురైన హాస్య అనుభవాలు ఎలాంటివైనా సరే తనతో పంచుకోమన్నాడు.. అన్ని రకాల హాస్య పుస్తకాలను తెప్పించుకుని చదవసాగాడు.. అంటే నార్మన్ వీలైనంత వరకు సంతోషంగా ఉండేందుకు ప్రాముఖ్యతనిచ్చాడు...

కొన్ని రోజుల తర్వాత డాక్టర్ మళ్ళీ చెక్ అప్ కోసం వస్తాడు.. ఈ సారి నార్మన్ లో ఉన్న పరిణతిని చూసి డాక్టర్ చాలా ఆశ్చర్య పోతాడు.. ఈ అభివృద్ధి ఎలా వచ్చిందో అతనికి అర్థం కాదు. ఎందుకంటే ఆ వ్యాధికి ఇంకా ఎటువంటి చికిత్స కనుగొనబడలేదు.. తను ఏమేం చేసాడో అంతా చెప్పమని ప్రాధేయపడి తెలుసుకున్నాడు...

ఆశ్చర్యం!! అద్భుతం!! ఇలాంటి పరిస్థితుల తర్వాత నార్మన్ కజిన్ దాదాపు ముప్పై సంవత్సరాలు బ్రతుకుతాడు!!! 

గమనిక:

చాలా మందికి ఉన్న ఋగ్మతల కంటే వాటి మీద ఉన్న దిగులే ప్రాణాంతకమవుతాయి.. ఈ రోజుల్లో ఉన్న ఋగ్మతలు కూడా టెన్షన్స్.. అనవసరమైన ఆందోళనల వల్లే... అందుకే రోజుమొత్తంలో వీలయినంత సమయం లేదా ఆందోళనకలిగే సమయంలో సంతోషకరమయిన టివి చానెల్స్ చూడడానికి.. ఆహ్లాదకరమైన విషయాల గురించి ఆలోచిస్తే ప్రస్తుత పరిస్థితి నుండి బయటపడవచ్చు... ఈ మధ్య లాఫింగ్ థెరపీ అనీ లాఫింగ్ క్లబ్బులనీ నెలకొల్పింది ఇందుకే... ఈ రోజు నుండీ క్రైమ్ చానెల్స్, క్రైమ్ వాచ్, లాంటివి కాకుండా.. కొంచెం మంచి చానెల్స్, కామెడీ చానెల్స్, మంచి ఆహ్లాదకరమైన సంగీతం చూసేందుకు / వినేందుకు ప్రయత్నించండి... మీ ఆందోళనల నుండి బయట పడండి

ఆంగ్లమూలం లో ఉన్న ఒక నిజజీవిత కథ కు స్వేచ్చానువాదం

Post a Comment

Whatsapp Button works on Mobile Device only