దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ఒక రోజు శ్రద్ధాంజలి అనే కాలమ్ లో తన పేరును చూసుకున్న అతను ఒక్కాసారిగా షాక్ తిన్నాడు... ఏమి జరిగిందో ఒక్క సారిగా అర్ధంకాలేదు... కొంచెం తమాయించుకుని ఆ పత్రిక వారికి ఏం జరిగిందో తెలుసుకుందామని ఫోన్ చేసాడు... వారు పొరపాటుగా వేరే వారి పేరుకు బదులు తన పేరును అచ్చు వేయించారని తెలుసుకున్నాడు... అయితే అయింది.. తన మృతి కి ఎవరెవరు ఏం కామెంట్స్ చేస్తున్నారని తనకు వచ్చిన సందేశాలన్నీ జాగ్రత్తగా పరికించసాగాడు... అందులో ఒకటి తనను "మృత్యు బేహారి" వర్ణించ బడిఉన్న ఒక కామెంట్ ను గమనించాడు...
కరెక్టే తనే... డైనమైట్ సృష్టికర్త అని... తను కనిపెట్టిన ఆ పరికరం కేవలం గనులను బ్లాస్టింగ్ చేసే దానికి ఉపయోగిస్తారు అని అనుకున్నాడు... కానీ దానిని మనుష్యులను చంపడానికి ఒక మారణాయుధంగా ఉపయోగిస్తారని అనుకోలేదు... కానీ ఆ తప్పుకు తాను కూడా బాధ్యుడే .. తను చనిపోయిన తర్వాత తనకు ఈ రకమైన పేరు రావటం తనకు ఇష్టం లేదు... అందుకే తను ఏమైనా చేసి తన మీద ఉన్న కళంకాన్ని తగ్గించుకోవాలి అనుకున్నాడు..
ఈ విధమైన పేరు రావటానికి తన మీద పడిన అపప్రధను తొలగించడానికి అతను చేసిన ఆలోచనా విధానం ఈ క్రింది విధంగా ఉంది???
తను సాధించిన దేమిటి???
తను జనుల దృష్టిలో ఏ విధంగా మిగిలిపోవాలనుకుంటున్నాడు???
తను చనిపోయినా తనకు మర్యాద ఇచ్చే అవకాశమున్న పని ఏమి చేయాలి???
తనను ప్రేమించాలంటే తను ఏమి చెయ్యాలి???
అతనే ఆల్ ఫ్రెడ్ నోబెల్... ప్రపంచ శాంతి కృషి చేసిన వారికిచ్చే నోబెల్ బహుమతి సృష్టి కర్త అతనే...
ఒకే ఒక్క బహుమతి అతని మీద ఉన్న ముద్ర ను చెరిపి వేయగలిగింది.. మనలో చాలా మందికి అతనే డైనమేట్ సృష్టి కర్త అనే విషయం కూడా తెలియదు..
మనం చేసే ప్రతి పని అది మంచి దైనా ఒక్కొక్కసారి మనం అనుకున్న ఫలితాలను కాకుండా వేరే రకమైన ఫలితాలను ఇవ్వవచ్చు... అందుకే ఉద్దేశ్యం మంచిదైనపుడు చేసిన తప్పును సరిచేసుకునేందుకు మనం తప్పని సరిగా ప్రయత్నించాలి... తప్పు చేసిన వారంతా చెడ్డ వారు కాక పోవచ్చు...
Post a Comment