Sunday, 6 April 2014

వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కథ - Real life case study - Moral stories

ప్రనయ్ అలేఖ్యలది ప్రేమ వివాహం.. అరమరికలు లేని దాంపత్యం.... ఇద్దరూ software engineer లే ... చేతినిండా జీతం... అందమైన చీకు చింతా లేని జీవితం... ఇలా 10 సంవత్సరాలు గడిచిపోతాయి.... మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలు తప్ప ఇంకేం సమస్యలు రావు... ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమంటే... ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత... తన పుట్టినరోజు కు ఆఫీసుకు సెలవు పెట్టి తనను బయటకు తీసుకు వెళ్ళమని చాలా రోజులనుండి... అలేఖ్య తన భర్తను పోరుతూ ఉంటుంది... కానీ ఆఫీసు పని లో తీరికి దొరకక ప్రనయ్ ఆ రోజు కూడా ఆఫీసుకు వెళ్ల వలసి వస్తూంది... కొంచెం సేపు అలిగిన తర్వాత అలేఖ్య చేసేదేమీ లేక లేచి స్నానం చేద్దామని బయలు దేరుతుంది... ఇంతలో calling bell మోగిన శబ్దం విని ... లేచి తలుపు తీద్దామని వెళ్తుంది... చూస్తె ఎదురుగా ప్రనయ్ బొకెతొ... బోకే ఇచ్చి ప్రనయ్ అంటాడు... ఐ లవ్ యు ... డియర్... నువ్వు లేక నేను లేను అంటాడు... అలేఖ్య చాలా సంతోషించి .... కొంచెం సేపు వెయిట్ చేయి .. నేను స్నానం చేసి వస్తా... అని బయలు దేరుతుంది... ఈ సారి వంటింట్లో ఉంచిన ఫోన్ రింగ్ అవుతూ వినిపిస్తుంది....దానిని అటెండ్ చేయగానే ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది... తన భర్త మెట్రో రైలు ఎక్కుతూ ప్రమాదవ శాత్తు జారి రైలు క్రింద పడి వెంటనే చనిపోయాడని... అతని జేబులో ఉన్న id card , పర్సు ఆధారంగా నిర్దారించుకుని ఫోన్ చేస్తున్నామని వెంటనే వచ్చి బాడీ ను తీసుకుపోమని చెప్తారు... దీనిని విని ఒక్కసారిగా జీర్ణించుకోలేక పోతుంది.. ఇప్పుడే కదా తలుపు తీసాను .. లోపలే కదా ఉన్నాడు అని గాభరా పడి... వెళ్లి హాల్ లో చుస్తే ప్రనయ్ కనిపించడు... ఇంతలో తనకు గుర్తు వస్తుంది... ఒక్కొక్కసారి తనకు ఇష్టమయిన వాళ్లకు బహుమతి గానీ ఏదయినా కోరిక గాని తీరకుండా చనిపోయిన వాళ్ళు అలా మనకు కనిపించి ఆ బహుమతి ఇచ్చి వెళ్లి పోతారని.. ... మనను భ్రమలో నెడతారని... అంటే ఇప్పటి వరకు బోకే ఇచ్చి తనను ఇష్టపడింది ప్రనయ్ ఆత్మనా.. భూ ప్రపంచం నిలువునా బ్రద్దలయినంత బాధ కలుగుతుంది అలేఖ్యకు.. నీరసం ఆవహించి కుప్పకూలి పోతుంది... ఇంతలో ఎక్కడినుండో ప్రనయ్ వచ్చి ఏమయింది అలేఖ్య... అని కంగారుగా పట్టుకుంటాడు... అలేఖ్యకు ఇంకా షాక్ తగులుతుంది... ఏమి జరుగుతుందో అర్ధం కాదు... అప్పుడు చెపుతాడు ప్రనయ్ ..."మర్చిపోయాను ఆలేఖ... ఈ రోజు నా పర్సు ఎవరో కొట్టేసారు.. వాడు కంగారులో రైలు కింద పడి చని పోయాడు కూడా... నేను నీకు బోకే ఇచే సందర్భంలో సరిగా పట్టించుకోలేదు... అని చెప్తాడు.... ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి అలేఖ్య గట్టిగ తన భర్తను కౌగిలించుకుంటూ... కళ్ళ నీళ్ళను పెట్టుకుంటుంది... కొన్ని కొన్ని దగ్గర ఉండేంత వరకు వాటి విలువ తెలియదు... దూరమయిన తర్వాత వాటి విలువ తెలిసినా ప్రయోజనం లేదని తెలుసుకొని... ఇకపై ఎప్పుడూ తన భర్తపై అలుగ కూడదని నిర్ణయించుకొంటుంది... 

నీతి: కొన్ని కొన్ని బంధాలు... కొన్ని కొన్ని విషయాలు దగ్గరగా ఉంటె వాటి విలువ తెలియదు... ఒక్కొక్కసారి అవి దూరమయిన తర్వాతే మనకు అర్ధమవుతుంది... వాటి విలువ... అవి స్నేహితులయినా... బంధువులయినా... వస్తువులయినా... 
అందుకే ఇష్టమయిన వాటిని ఎప్పుడూ గౌరవించటం నేర్చుకోవాలి...
 మూలం: ఆంగ్లంనుండి స్వేచ్చానువాదం చేయబడినది

Post a Comment

Whatsapp Button works on Mobile Device only