Sunday, 6 April 2014

వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కథ - 300 balloons case study

ఒక సైకాలజీ సెమినార్ క్లాసు జరుగుతుంది.... దాదాపు 300 మంది ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.. ఇంతలో అకస్మాత్తుగా ప్రసంగీకుడు పాఠం ఆపి అందరినీ ఒక పేద్ద హాలు దగ్గరికి తీసుకు వెళ్తాడు... మీకు ఒక గ్రూప్ యాక్టివిటీ ఇస్తున్నను అని అందరికీ  తలా ఒక బెలూను ఇచ్చి దానిని ఊది బెలూను మీద ఎవరి పేర్లు వారు వ్రాసి ఆ హాలు లో వేయమని ఆదేశిస్తాడు... అందరూ ఆ లెక్చరర్ చెప్పిన విధంగా చేస్తారు.. అపుడు ఆ హాలంతా బెలూన్లతో నిండి పోతుంది...
ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ లెక్చరర్... మీ అందరికీ ఇంకొక ఐదు నిమిషాలు సమయమిస్తాను.. ఎంత మంది తమ బెలూన్లను కనుగొనగలరో ప్రయత్నించండి... ముందు వచ్చిన వారు నిజమైన సమర్ధులు అని చిన్న కాంపిటిషన్ లా చెపుతాడు....

ఇక అందరిలో టెన్షన్ పెరిగి ఎవరికి వారు ప్రయత్నించడంలో పోటీలు పడి చివరికి ఒక్కరు కూడా తమ బెలూన్ పొందలేకపోతారు...
ఈసారి ఆ లెక్చరర్.. మీరొక పని చేయండి... అందరూ లైన్ లో నిలబడి ఒకరు బెలూన్ తీసుకుని దాని మీద ఉన్న పేరు చదవండి .. మిగిలిన వారిలో ఆ పేరు గల వారు బెలూన్ తీసుకోండి అని అనౌన్స్ చేస్తాడు... ఈసారి కేవలం మూడు నిమిషాలలో ఎవరి బెలూన్ వారి చేతికి వస్తుంది..
ఈ గ్రూప్ యాక్టివిటీ మనకు నేర్పే నీతి:
 ఈ గ్రూప్ యాక్టివిటీలో బెలూన్ అనేది మన లోని ఆనందం... మనలో ప్రతి ఒక్కరం ఆనందం కొరకే ప్రాకులాడతాం.. అందరం వెతుకుతాం.. కానీ ఎవరికి వారు ప్రయత్నించడంలొ మిగిలిన వారిని అధిగమించాలనే తొందరలో పడి పోయి అసలైన ఆనందాన్ని అనుభవించలేం.. మరియు మిగిలిన వారికి కూడా దక్కనీయకుండా చేస్తున్నాము... అదే ఒకరికి ఒకరు సహకరించుకోవడం వలన అందరూ తొందరగా దానిని పొందే వీలు కలిగింది.. ఈ పాఠాన్ని నేర్చుకున్న తర్వాత దానిని ఆచరించి చూడండి.. జీవితంలోని విలువైన విషయాలేమిటో మీకు అర్థం అవుతుంది..

మూలం: ఆంగ్లంనుండి స్వేచ్చానువాదం చేయబడినది

Post a Comment

Whatsapp Button works on Mobile Device only