Wednesday, 19 March 2014

తిరుమలలో ఇబ్బందులు కలుగకుండా దర్శనం చేసుకునే విధానము- Are you planning to Tirumala -

ఓం నమో వేంకటేశాయ

పాపం శమించు గాక!! మధ్య కాలంలో అందరూ తిరుమల వెంకన్నను కామెంట్ చేసే వారే ఎక్కువయ్యారు గానీ, ఆలోచించే వారు తక్కువయ్యారు!! ఒక రోజుకు 80,000 నుండి 1,00,000 కు పైగా వచ్చి పడే భక్తులకు వసతులు కల్పించడం మామూలు విషయమా!!
ఒక విషయం గమనించండి... ప్రణాళిక లేని వారే ఇబ్బందులకు గురి అయ్యేది??మనం కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్ళాలనుకుంటే కనీసం 40 రోజుల ముందునుండే దర్శనమునకు వీలుగా టి.టి.డి కళ్యాణమండపాన్నయినా సంప్రదించవచ్చు.. ఇప్పుడు ప్రతి జిల్లాకు రెండు సెంటర్లలో ఆన్ లైన్ బుకింగు సదుపాయం ఉన్నది.. అక్కడ దర్శన మరియు వసతులకోసం ముందస్తు రిజర్వేషన్ చేయించుకోవచ్చు... ప్రతి సేవ, వసతి, మొదలగు వాటిని ఆన్ లైన్(అనగా ఇంటర్ నెట్) ద్వారా మన ఇంటి నుండే బుక్ చేసుకోవచ్చు... మరియు డి.డి. తీసి కూడా పంపించవచ్చు.. కొన్ని కొన్ని కార్యాలయాలలో అయితే ఫోన్ చేసి రిజర్వ్ చేసుకుని డి.డి. పోస్ట్ ద్వారా పంపుకునే సదుపాయాలు కూడా ఉన్నాయి!! 
(Advance Booking: Advance Booking of Srivari Arjitha Sevas can be done by sending Demand Draft in favour of the Executive Officer, T.T.D to the Assistant Executive Officer, Arjitham Office, Sri T.T.,Tirumala - 517 504 , 90days in advance. The Demand Draft for Advance Booking of seva can be accepted only for the following sevas:Suprabhatam, Kalyanothsavam, Dolothsavam, Arjitha Brahmothsavam, Visesha Pooja, Vasanthothsavam, Sahasra Deepalankarana seva, Nijapada darshanam.)
    Assistant Executive Officer
    Arjitham Office
    Sri T.T.,Tirumala - 517 504
    Contact No.0877-2263679
 అయినా టి.టి.డి. వారు మన కోసం ఇన్ని సదుపాయాలు చేస్తున్నా మనం గుర్తించకుండా వారిని విమర్శించడం ఎందుకో నాకు నచ్చలేదు..
మనం ముందస్తు ప్రణాళిక లేకుండా తిరుపతి కి వెళ్ళినా క్రింది జాగ్రత్తలు తీసుకుంటే సులువుగా దర్శనం చేసుకోవచ్చు..
1. తిరుపతిలో శ్రీనివాసం లో స్నానాధిక కార్యక్రమాలు ముగించుకుని... ఉదయం 5:30 గంటలలోపు తిరుమలలో 300 రూ. దర్శన క్యూలో నిలబడగలిగితే 8:00 గంటలలోపు దర్శనం అయిపోతుంది...
2. అంత డబ్బు లేనివారు శ్రీనివాసంలోనే దర్శనం కొరకు టికెట్స్ కూడా ఇస్తారు, అందులో ఇదివరకు 50రూ, 100, ఉచిత దర్శన టోకన్ ఇచ్చేవారు... వీటిని పొందాలంటే మనం ఉదయం 5:00 లోపుగా శ్రీనివాసంలో క్యూలో ఉండవలసి ఉంటుంది..
3. తిరుమలకు శ్రీవారి మెట్లు నుండి కాలి మార్గం ద్వారా పైకి చేరుకోవడం చాలా సులభం.. మార్గం మొత్తం శ్రీనివాస నామాలతో అడవి మధ్యగా ప్రయాణం చాలా.. చాలా బావుంటుంది.. మధ్యలో టోకెన్ ఇస్తారు.. దీని నుండి ప్రవేశం ౩౦౦ రూ. క్యూలో మనను కలుపుతారు... దర్శనానికి గరిష్టంగా గం. కన్నా ఎక్కువ పట్టదు..
4. ఒక రోజుకన్నా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే శ్రీనివాసం లోఉండవచ్చుశ్రీనివాసంలో కాటేజ్ కొరకు ఉదయం 5:30 నుండి క్యూ ఉంటుంది.. కానీ విడిగా యాత్రికుల కోసం ఉచిత స్నానపు గదులు.. మిగిలిన వసతి అంటే నేల మీద పడుకోవచ్చు... సామాన్లు భద్రపరచుకునేందుకు లాకరు సదుపాయం 
ఉంటుంది
5. మనం గనుక ఒక రోజు ఉండేలా నిర్ణయించుకుంటే.. శ్రీనివాసంలో ఉండడమంత మంచి పని వేరొకటి లేదు.. ఆరోజు అన్ని పనులు ముగించుకుని స్థానిక దేవాలయాలు, అనగా కంచి, స్వర్ణదేవాలయం లేక తిరుపతిలోని దేవాలయాలు దర్శించుకుని రెండవరోజు ఉదయం 5:30 లోగా క్యూలో ఉంటే మంచిది... ఉచిత భోజనం ఇష్టపడని వాళ్ళకు ప్రతి కమ్యూనిటీ వారికి విడిగా సత్రాలు అంటే ఉచితంగా బోజనం పెట్టేవి గమనించాను... సరిగ్గా విచారించుకొని వెళ్ళగలిగితే మంచి భోజనం చేయవచ్చు.
ఒకటి గుర్తుంచుకోండి.. వి..పి. లు ఎవరు ఎంత మంది వచ్చినా మన ప్రణాళీక మనకుంటే చాలా సంతోషంగా , వెంకన్న దర్శనం చేసుకోవచ్చు... వేరేవారి గురించి మనకెందుకు... దర్శన క్యూలో ఉన్నంత సేపు .. పొందే ఆధ్యాత్మిక భావనపై దృష్టి పెట్టండి... ఆనందంగా దర్శించుకోండి...
శ్రీ వేంకటేశ్వర కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు...
Link for online services:
http://www.ttdsevaonline.com/
http://www.tirumala.org/
http://www.tirumala.org/Advance%20Booking.htm



Post a Comment

Whatsapp Button works on Mobile Device only