Wednesday 19 February 2014

యాగంటి క్షేత్రం అద్భుతాలకు నిలయం: temples information

యాగంటి క్షేత్రం అద్భుతాలకు నిలయం: 
మేము ఈ క్షేత్రం లో నంది ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతాడని.. కలియుగం అంతంలో యాగంటి బసవన్న రంకె వేస్తాడని బ్రహ్మం గారి పురాణంలో విన్నాం.. అంతే గాని ఈ క్షేత్రాన్ని చూసిన తర్వాత మా అనుభూతులు వేరే... మేము క్షేత్రాన్ని చేరేసరికి రాత్రి 7:30 అయింది... ఆ చీకటిలో చుట్టూ ఉన్న కొండలు బ్రహ్మ విష్ణు మహేశ్వరునిల కనిపించాయి...


చాల అద్భుతమయిన అనుభూతి... ఆ తన్మయత్వం నుండి తేరుకోలేక పోయాం.. అసలు ఆ రోజు అక్కడ ఉండాలన్న ఆలోచన లేదు కాని... లీవ్ పోడిగించుకొని మరీ ఉండిపోయాం ... అక్కడ చాల సత్రాలు ఉన్నాయి.. వసతి సౌకర్యం ఉంది... ఉచితంగా రెడ్డి గారి సత్రంలో భోజనం చేసాము... మాతో పాటు ఇంకో 2 కుటుంబాలు మాకు జత కలిశాయి... మేము శ్రీశైలం నుండి మహానంది...  ఆ తర్వాత అహోబిలం... చూసుకుని ఇక్కడకు వచ్చాము... 
ఈ గుడి చాల సంవత్సరాల క్రితంది.... మొదట వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని మొదలు పెట్టి విగ్రం తయారయ్యే సమయానికి స్వామి వారి కాలి బొటనవేలిలో లోపం గమనించారట... ఈ లోపల గుడి కట్టించే రాజు కలలో ఈశ్వరుడు కనిపించి ... ఇక్కడ నా విగ్రహం ప్రతిష్టించు... అని అదేశించాడట... ఇక్కడ ఉన్న శివ లింగం లో నే శివుడు.. పార్వతి ఇద్దరు ఒకే లింగంలో దర్శనమిస్తారు ... ఈ క్షేత్రంలో ఇది ఒక ప్రత్యేకత... 
అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో యాగం చేసేటప్పుడు రాక్షసులు కాకి రూపంలో వచ్చి మాసం ముక్కలు యాగాగ్నిలో వేస్తున్నారని కాకులు ఈ క్షేత్రంలో తిరగరాదని... అగస్త్యుడు శాపమిచాడట... అందుకే ఈ క్షేత్రంలో కాకులు ఉండవు.... (అగస్త్యుని యాగం వలన ఖ్యాతి చెందింది కాబట్టి ఊరు పేరు యాగంటి అయిందని ఒక వినికిడి )
శని వాహనం కాకి ... ఇక్కడ కాకిని నిషేధించారు కాబట్టి ఇక్కడ నేను ఉండను... అని అయన చెప్పాడంట... అందుకే ఈ గుడిలో నవగ్రహాలు ఉండవు.... ఆ ప్రదేశం లో నందీశ్వరుడు ఉంటాడు...
ఈ గుడిని మొదట వెంకటేశ్వర స్వామి కోసం మొదలు పెట్టారు కాబట్టి...  ఈ ఆలయం నిర్మాణం విష్ణు ఆలయాల మాదిరి ఉంటుంది...








తయారు చేసిన వెంకటేశ్వరస్వామిని ఒక గుహలో ఉంచారు...

ఇక్కడి వెంకటేశ్వర స్వామి మనం రోజు చూస్తున్న మాదిరిగా కాకుండా.. కొంచెం విభిన్నంగా అనిపించాడు...
 
ఇక ప్రధాన్యమయినది.. నంది... ఈ నదీశ్వరుడు... మొదట మండపం మధ్యలో ఉంది చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఉండేదట... ఇప్పుడు పూర్తిగా ఆక్రమించి.. స్తంభాలలో సరిపోవటం లేదు...


పురావస్తు వారి నివేదిక ప్రకారం 2
 సంవత్సరాలకు 1 అంగుళాలు పెరుగుతున్నాడట.... 
కోనేరు లో కోనేరులో నీరు ఎక్కడ నుండి వస్తుందో... తెలియదు...సంవత్సరం లో 365 రోజులు నీరు ఉంటుంది...
నీరు గుడి బయటకు వచ్చిన తర్వాత మాయమవుతుంది... అది ఎక్కడకు వెళ్తుందో తెలియదు... అక్కడ బోర్ వేసిన చుక్క నీరు కూడా పడదట...
 
ఈ క్షేత్రం గురించి కేవలం మాటలలో మాత్రమే కొంచెం వివరించాను... నా అధ్యమిక అనుభూతిని మీకు చూపించలేను... జీవిత కాలంలో ఒకసరయిన చూడదగిన క్షేత్రం యాగంటి...
శ్రీరాగ


Post a Comment

Whatsapp Button works on Mobile Device only