Saturday 22 February 2014

"చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం" ఈ నానుడి ఎలా వచ్చింది.... (లంకా దహనం)- Stories from Ramayana

"చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం" ఈ నానుడి ఎలా వచ్చింది.... 
(లంకా దహనం)

ఈ నానుడి ని కొంతమంది అనుచరుల గురించి బాగా హుషారుగా తెలివిగా పనిచేస్తారని చెప్పేదానికి వాడతారు... 
శ్రీ రాముడు సీతాదేవి గురించి వెతికి వెతికి చాల బాధగా ఉంటాడు... ప్రస్తుతం ఉన్న రామేశ్వరం వద్దకు రాగానే మొత్తం సముద్రం మాత్రమె కనిపిస్తుంది.. లంకకు ఎలా వేళ్ళలో తెలియదు... అక్కడ సీత ఉంటుందో లేదో తెలియదు... దీనిని నిర్ధారించు కొనేందుకు నమ్మినబంటు అయిన హనుమంతుడిని వెళ్లి చూసి రమ్మని ... సీతాదేవి ఎక్కడ ఉందొ .. ఎలా ఉందొ చూసి రమ్మని
లంకకు పంపుతారు ... అక్కడ లంకలో సీతను చూడడం రావణాసురిడికి హిత బోధ చెయ్యడం... రావణుడు దానిని పట్టించుకోకుండా అతని తోకకు నిప్పు పెట్టడం.. తోకకు అంటిన నిప్పుతో మొత్తం లంకా నగరాన్ని ధ్వంసం చేయడం అన్నీ జరుగుతాయి..... ఇక్కడ హనుమంతుడు సీతాదేవిని లంక నుండి తీసుకురాగల సమర్ధుడే అయినా... సీత దేవి అభీష్టం మేరకు .... వట్టి చేతులతోనే తిరిగి వస్తాడు.... 
అంటే సీతాదేవిని చూసి రమ్మంటే కేవలం చూడడమే కాకుండా... మొత్తం లంక నగరాన్ని కాల్చి... శత్రువుకు దడ పుట్టించి వస్తాడు మన హనుమంతుడు... 
అప్పటినుండే ఒక ఉత్తమోత్తమం అయిన, సమర్దుడయిన అనుచరుని గురించి చెప్పేదానికి ఈ నానుడిని ఉపయోగిస్తారు... 
SRIRAGA

Post a Comment

Whatsapp Button works on Mobile Device only