Friday 21 February 2014

Rama Setu detailed information story video pdf free download - శ్రీరామ సేథు

శ్రీరామ సేథు:



రామ సేతువులోని రాయికి ఎంత positive energy ఉందో ఈ AURA SCAN EXPERIMENT లో చూడండి



త్రేతాయుగంలో సీతమ్మను లంకలో ఉన్న రావణుడి చెర నుండి విడిపించడానికి రాముడు నిర్మించిన వారథి.
కొన్ని వేల సంవత్సరములయినా ఇంకా చెక్కుచెదరలేదు. అది గూగుల్ పటాలలో కూడా కనపడుతుంది. ఉపగ్రహాల నుండి చూసినపుడు కూడా కనపడుతుంది..
ఇది ధనుష్కోటి ద్వీపంనుండి లంకకు వేసిన కాలి బాట... అసలు ఆ కాలంలోనే నీటిపై తేలే ఇటుకలను ఎలా కనిపెట్టారో...

అవి ఇన్ని సంవత్సరాలయినా చెక్కు చెదరక నిలిచి వుండటం దైవ లీల కాక మరొకటి కాదు కదా...
ఈ వారధి లోని ఇటుకలను సేకరించి ఈ ఇటుకలపై పరిశోధనలు చేసి
దాని మీద ఉన్న కర్బన పరమాణువుల వయస్సు గుర్తించారు.. అవి మన త్రేతాయుగ కాలానికి సరిపోయే విధంగానే ఉన్నాయి...
ఇంతటి మహత్తు కలిగిన మన సాంస్కృతిక అంశాలు కలిగిన ఈ వారధిని.... కేవలం రవాణా ఖర్చు కలిసి వస్తుంది..... వ్యాపారం వృద్ధి అవుతుంది అనే మిషతో తొలగించాలని గతంలో DMKవారు ( అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి) ప్రణాళిక వేశారు.... దానికి సేతు సముద్రం ప్రాజెక్టు
అని పేరు కూడా పెట్టారు...
విచిత్రం ఏమిటంటే బ్రిటిషు వారి ప్రకారం మన వారధి పేరు... ఆడమ్స్ బ్రిడ్జి.... (బ్రిటిషు వారు మన దేశం పేరునే... ఇండియా గా మార్చారు... వారికి ఇదొక లెక్కేకాదు) చాలా బాధగా అనిపించింది... రాముని ఉనికికి సైద్ధాంతిక నిరూపణ లేదని వాదించారు..

విదేశీ సైంటిస్టులు (మన భారతీయులు కాదు... ఎందుకంటే ఈ పరిశోధనలు జరిగింది శ్రీలంకలో)  అన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని కోట్ల వానర సైన్యాన్ని భారత దేశంనుండి తరలించి యుద్ధం చేయడమంటే మామూలు విషయం కాదు...

కానీ మన మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి వారి అకుంఠిత దీక్ష రాముల వారి కరుణా కటాక్షాలు మనకు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి.. మన సంస్కృతీ వారసత్వ సంపదలను కాపాడుకోగలుగుతున్నాము.... వాటి వివరాలను గురించిన కొన్ని చిత్రాలను ఇక్కడ పెడుతున్నాను...



ఈ వారధి కొన్ని ప్రదేశాలలో ఇరుకు గానూ... కొన్ని ప్రదేశాలలో చాలా వెడల్పుగానూ... చాలా ప్రదేశాలు నీటిలో మునిగిన విధానంలో ఉన్నాయి...చివరికి ఎన్ని సార్లు భారత శ్రీలంకలను సాటిలైట్ ద్వారా ఫోటోలను తీసినా ఈ రామసేతు మనకు కనపడుతుంది... దాని నిర్మాణం ఎలా సాగిందో ఈ.. వీడియోలో ఉంది...


శ్రీరాగ
Full detailed story about rama sethu: శ్రీ రామసేతువు:

శ్రీ రామసేతువు (Big notes about Ramasethu... interesting to know)
జై శ్రీ రామ 700 సంవత్సరాల ఇస్లాం దండయాత్రలు, 300 సంవత్సరాల (బ్రిటిష్)క్రైస్తవ ఆక్రమణ, దాడుల తరువాత కూడా ఈ ప్రపంచంలో అనాది కాలం నుండి కొనసాగుతూ వస్తున్నది ఒక్క హిందూ ధర్మమే. మన సంస్కృతి ఎవరు వేలెత్తి చూపలేరు. గత 200 సంవత్సరాలలో కొనుగొన్నామని చెప్తున్న సాంకేతిక పరిజ్ఞానమంతా కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన తాళ్ళపత్ర గ్రందాల్లో రాయబడి ఉన్నాయి. మనకు అనేక పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, స్మృతులు, సంహితలు ఉన్నాయి. రామాయణ, మహభారతాలు ఇతిహాసాలు. ఇతిహాసం అంటే 'ఇలాగే జరిగింది ' అని అర్దం. ఇవి ఈ సృష్టి వయసు కొన్ని కోట్ల సంవత్సరాలని ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పడానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే చెప్పాయి. భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు ఈ దేశాన్ని ఆక్రమించాలి అంటే ఈ దేశ సంస్కృతిని, ధర్మాన్ని, విలువలను నాశనం చేయాలని భావించారు. దానికి ఆద్యుడు మోకాలె. ఈయన భారతదేశం మొత్తం పర్యటించి బ్రిటిష్ పార్లమెంట్లో 2-2-1835 న ఒక ప్రసంగం చేశాడు. Lord Macaulay’s address to the British Parliament in 2 February, 1835: "I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation." ఈ దేశాన్ని ఆక్రమించాలన్నా, భారతదేశాన్ని ఎప్పటికి బానిస దేశం గా మార్చాలన్నా ముందు ఈ దేశస్థులకు తమ ధర్మం, తమ విద్యావిధానం కంటే, ఇంగ్లీష్ మరియు విదేశీ విద్యావిధానం మంచిది, వారి సంస్కృతే గొప్పదనే భావన రావాలి, అందుకు భారతదేశాంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాలని చెప్పడమే ఆ ప్రసంగ సారాంశం. దాని అమలు పరిచి Geomentry వంటి 18 సబ్జెక్టులతో ఉన్న హిందూ విద్యావిధానాన్ని సర్వనాశనం చేశారు. దానికి తోడు వారి బైబిలు ఈ సృష్టి వయసు 5000 సంవత్సరాలని చెప్పింది. దాని వాదనను బలపరచడం కోసం, తమ మతాన్ని ప్రచారం చేయడం కోసం మన దేశ చరిత్రను తారుమారు చేసి కల్పితమైన చరిత్రను మనకు ఇచ్చారు. దాదాపు 2000 సంవత్సరాల చరిత్రను తొక్కేశారు(ఆధారాలు రాబోయే రోజుల్లో తెలియపరుస్తాం). ఇప్పుడు మనం పాఠశాలలో చదివినది, వారు వ్రాసిన చరిత్రే. దానితో పాటు అనేక చారిత్రిక ఆధారాలను నాశనం చేశారు. అప్పుడే వారు హిందువుల పురాణాలు కల్పితాలు, అవన్ని అబద్దాలంటూ, పుక్కిటి పురాణాలు హిందువులవి అంటూ ప్రచారం చేశారు. ఎందుకంటే మన దేశ చరిత్ర అంతా మన పురాణాల్లో సుస్పష్టంగా లిఖించబడి ఉంది. అవి తప్పని ప్రచారం జరిగితే కానీ తమూ వ్రాసిన చరిత్రను భారతీయులు నమ్మరన్నది వారి ఆలోచన. వారి విద్యావిధానంలో చదువుకున్న మనం కూడా మన పురాణ, ఇతిహాసాలు కల్పితాలంటూ, మన సంస్కృతి వ్యర్ధమంటూ, పదేపదే మనల్ని మన నిందించుకుంటూ మోకాలే వారస పుత్రులం అయ్యాం. విషయంలోకి వస్తే రాముడే లేడంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో 2002 లో నాసా తమ ఉపగ్రహం ద్వారా తీసిన కొన్ని ఫోటోలను విడుదల చేసింది. భారత్-శ్రీలంకల మధ్య ఒక వారాధి/వంతెన ఉందన్న విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచింది. శ్రీ రాముడు లంకను చేరి, రావణ సంహారం చేయడానికి, వానరసేన నిర్మించిన వంతెన అది. దాని పేరే రామ సేతువు. ఈనాటికి హిందూ మహసముద్రంలో ఉన్నది ఈ 'శ్రీ రామ సేతువు '. దీని కూల్చడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ శ్రీ రామసేతువు గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ రాముడిగా అవతరించారు కానీ ఎక్కడ మహిమలు చూపలేదు. ఒక మనిషి ఎలా ఆవేశపడతాడో, ఎలా భాధపడతాడో, కోపానికి, సంతోషానికి గురవుతాడో అచ్చం అలాగే రాముడు కూడా అనుభవించాడు. మనిషి ఎలా బ్రతకాలో, తాను తన దైవలీలలు చూపకుండా, మనిషిగా ధర్మాన్నీ ఆచరించి చుపించాడు. శ్రీ రామసేతువు నిర్మాణానికి సంబంధించి నలుడు, నీలుడికి రాముడికి మధ్య ఒక అద్భుతమైన సంవాదం రఘువంశంలో కనిపిస్తుంది. రావణాసురుడు చేత అపహరించబడిన సీతమ్మ లంకలో ఉందన్న విషయం హనుమంతుని ద్వారా తెలుసుకున్న శ్రీ రాముడు సముద్రం దాటి లంకకు ఎలా చేరాలా అని చింతిస్తున్నాడు. అప్పుడు వానరసేనలో ఉన్న నలుడు, నీలుడు రాముడి వద్దకు వచ్చారు. వీళ్ళిద్దరు ఈ ప్రపంచ చరిత్రలో తొలి Hydraulic Engineerలు. వాళ్ళు రాముడిని సమీపించి "మీరేం భాధపడకండి. రాళ్ళ సహాయంతో సముద్రంలో మేము వంతెన నిర్మిస్తాము". సముద్రంలో రాళ్ళు ఎలా నిలబడతాయి? అని రాముడు ప్రశ్నిస్తే, మీకు ఆందోళన ఎందుకు? అది మాకు సంబంధించిన విషయం. Hydraulics మాకు అర్దమవుతాయి కానీ మీకు కాదు. ఎందుకంటే మాకు Hydraulic Engineeringలో మంచి నైపుణ్యం ఉంది. పడవల సహాయంతో సముద్రంలో రాళ్ళను పడేసి, ఒకదానిపై ఒకటి పేరుస్తాము. అవి పైవరకు వచ్చాక అప్పుడు సేతువు నిర్మాణం మొదలుపెడతామన్నారు నలుడు, నీలుడు. ఈ వంతెన నిర్మాణానికి ఎన్ని రోజుల పడుతుంది అని రాముడు అడుగగా, ఎన్ని రోజులైనా పట్టనివ్వండి, వంతెన పూర్తి చేస్తాం అన్నారు. వారధి పూర్తిచేస్తారు, మనం లంకకు వెళ్తాం, వెళ్ళిన వాళ్ళం తిరిగివస్తామా? వంతెన మధ్యలోనే కూలిపోతే? అని రాముడు తన సందేహాలను వ్యక్తం చేశాడు. మీకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, ఈ వంతెన మీద వెళ్ళిన మన సేన ఖచ్చితంగా తిరిగివస్తుంది. కాని రావణాసురిడి సైన్యం వస్తే మాత్రం ఈ వంతెన కూలిపోతుంది. ఇదెలా జరుగుతుందంటే, మేము ముందే ప్లాన్ వేసి, కొలతలు తీసుకున్నాం. మన సేనలో అన్ని వానరాలే(కోతులు) ఉన్నాయి. కోతులు నడిచే సమయంలో భూమి మీద అతితక్కువ ఒత్తిడి(pressure) మాత్రమే పెడతాయి. పరమాత్ముడు వాటి శరీరాన్ని ఏ విధంగా రూపొందించాడంటే, అవి తమ చేతులు, కాళ్ళను అతి తక్కువ సమయం నేలపై పెడతాయి, ఒక వేళ వాటి చేతులు, కాళ్ళను భూమి పై పెట్టిన వెంటనే అక్కడి నుండి దూకి వేరే ప్రదేశానికి వెళతాయి. అలా చాలాదూరం అవి దూకుతూ(jump) వెళ్ళగలవు. 1, 2 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం అవి అలాగే వెళ్ళగలవు. ఈ వంతెన డిజైన్ ఏ విధంగా చేసామంటే, దాని మీద వానరాలుదూకుతూ దాటగలవు, కానీ రావణ సైన్యం వచ్చిదంటే ఈ వంతెన కుప్పకూలిపోతుంది. ఎందుకంటే రావణసైన్యంలో అందరూ రాక్షసులే ఉన్నారు. వారి శరీరం చాలా పెద్దగా, బలంగా ఉంటుంది. వారూ నేలమీద తమ శరీరం ద్వారా అధిక భారం/ ఒత్తిడి(pressure) వేస్తారు. అందువల్ల ఈ సేతువు తెగిపోతుంది. వాళ్ళు మునిగిపోతారు. మనమే గెలుస్తాము. ఓడిపోయే అవకాశమే లేదు అన్నారు నలుడు, నీలుడు. సేకరణ- Ram Setu A Construction Engineering Wonder రాజీవ్ దీక్షిత్ ఉపన్యాసం, రామసేతువు నిర్మాణం ఎలా చేశారు? వాల్మీకి రామాయణం : (6-22-51 TO 6-22-71) సమర్ధచాపి సేతుం కర్తుంవై వరుణాలయే ||6-22-51 తస్మాతథైవ బంధంతు సేతుం వానర పుంగవః నేను సేతువును నిర్మించడంలో సమర్ధుడను. వానరులలో బలవంతులు ముందుకు వస్తే ఇప్పుడె నిర్మిస్తాను అన్నాడు నలుడు. రాముడూ ఆజ్ఞతో కొన్ని వందల వానరాలు అన్ని వైపులా వ్యాపించి ఉన్న అడవులపైకి ఆనందంతో గంతులు వేస్తూ పరిగెత్తాయి. పర్వతాల వంటి శరీరం సౌష్టవం కలిగిన వానరసేనాధిపతులు పెద్ద పెద్ద రాళ్ళను, కొండలను, చెట్లను విరగ్గొట్టి సుంద్రం వద్దకు తీసుకువచ్చారు. అశ్వకర్ణ, ధావ, అర్జున, మామిడి, అశోక, బిల్వ, శతపర్ణ మొదలైన చెట్లను సందురంలో పడేస్తున్నారు. మంచివానరాలు కొన్ని చెట్లను వ్రేళ్ళతో సహా , కొన్నిటికి వ్రేళ్ళు లేకుండానూ భూమిని నుంచి పెల్లగించి, ద్వజస్థంభాలను ఎత్తుకొస్తున్నారా అన్నట్టుగా తీసుకువచ్చారు. ప్రక్కన ఉన్న ప్రదేశాల నుండి వేప, కొబ్బరి, దానిమ్మ మొదలైన చెట్లను కొన్ని వానరాలు తీసుకువస్తున్నాయి. హస్తిమాత్రన్ మహాకాయః పాశానాంచ మహాబలః ||6-22-58 పర్వతాంశ్చ సముత్పట్యా యంత్రైః పరివహంతి చ ప్రక్షిప్యామాణైర్ అచలైః సహసా జలం ఉద్దతం ||6-22-59 కొండలవంటి శరీరంతో, ఏనుగులవలే ఉన్న కొండలను పెల్లగించి యంత్రాల(Machines/cranes) సహాయంతో తరలించి, ఒక్కసారిగా అన్ని వైపుల నుండి సముద్రంలో రాళ్ళను పడేయడంతో సముద్రంలో నీరు ఒక్కసారిగా పైకి లేచి క్రింద పడుతోందట.(యంత్రాలంటే క్రేన్లు మొదలైనవి. ఇవి ఆ కాలానికే ఉన్నాయి). "సూత్రాణ్యయే ప్రగృణంతి హ్యాయతం శతయోజనం" అంటే ఈ సమయంలో కొందరు రామసేతువును సరైన ఆకారంలో ఉందా, కొలత సరిగ్గా ఉందా అని కొలవడానికి వందయోజనాల stringను సిద్ధం చేస్తున్నారట. నలుడు, తన బాధ్యతగా సముద్రం మధ్యలో సేతువును నిర్మాణాన్ని ఇతర వానరాల సహాయంతో ప్రారంభించాడు. కొందరు వంతెన కొలవడానికి పొడవైన కర్రలనూ, ఇంకొందరు నిర్మాణానికి సంబంధించిన ఇతరవస్తువులను(సున్నం మొదలైనవి) దగ్గరపెట్టుకున్నారు. రెల్లుగడ్డి, పెద్ద పెద్ద దుంగలను కొన్ని వందల వానరాలు తీసుకువచ్చి, రాముడి ఆజ్ఞతో సేతువు నిర్మాణాన్ని వేగవంతం చేశాయి. మంచి సువాసన కలిగిన చెట్లను ఉపయోగించి, కొన్ని రకాల చేట్ల వ్రేళ్ళు, సున్నమూ, ఊడలతో బండలను ఒకదానికి ఒకటి దగ్గరగా,గట్టిగా కడుతూ అటూ, ఇటు వేగంగా పరుగులుపెడుతున్నాయి. ఈ విధంగా మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, 3వ రోజు 21 యోజనాలు, 4వ రోజు 22 యోజనాలు, 5వ రోజు 23 యోజనాలతో మహాసేతువును, ప్రపంచంలో మానవనిర్మిత వంతెనను నలుడు ఆధ్వర్యంలో వానరసేన పూర్తిచేసింది. ఆధునిక ఇంజనీరింగ్ నిపుణులే ఆశ్చర్యపడేంతగా రామసేతువు నిర్మాణంలో ఉన్న నైపుణ్యం, ప్రత్యేకత ఏమిటి? అది ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిలిచి ఉంది? నలుడి ఆధ్వర్యంలో క్రేనులు, డ్రిల్లింగ్ మెషీన్లు, నైపుణ్యం కలిగిన వానరుల సహాయంతో 48 కిలోమీటర్ల పోదవు, 2.5-3 కిలోమీటర్ల వెడల్పుతో, సముద్రగర్భంలో 22 అడుగుల లోతు వరకు ఉండేలా సేతువును నిర్మించారు. అసలే సముద్రం మీద నిర్మిస్తున్న వంతెన. Straight గా నిర్మిస్తే పెద్దపెద్ద సముద్రపు అలల తాకిడి వలన ఒత్తిడికి గురై నిర్మాణానికి ప్రమాదం సంభవిస్తుందని, వంతెన మధ్యలోనే తెగిపోయే ప్రమాదం ఉందని, Arc Shape వచ్చేలా వారధిని డిజైన్ చేశారు. సునామీ(ఉప్పెన) వంటి ఉత్పాతాలు సంభవించినా సేతువుకు ఎటువంటి నష్టం వాటిల్లకపోవడానికి కారణం సెతువు ' Arc'shape ఉండడమే. సముద్రం మీద కడుతున్న వారధి, సముద్రం యొక్క ప్రవహానికి అడ్డురాకూడదని, అక్కడున్న జలచరాలకు ఇబ్బంది కలగకూడదని, అలాగే సముద్ర ప్రవాహానికి అడ్డుగా ఒక గోడలాగా కడితే, వంతెన life ఎక్కువకాలం ఉండదని, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నిర్మాణం చేయరాదని భావించినా నలుడు, సముద్రపు నీరు వెళ్ళేందుకు వీలుగా 7 equal intervalsలో రామసేతువు క్రింది భాగంలో openings వచ్చేలా డిజైన్ చేశారు. ఇవి నీటిని బయటకు drain చేస్తాయి. సేతువు వెడల్పు(width) మొదట 2.5 కిలోమీటర్లు ఉండగా, మెల్లమెల్లగా పెరుగుతూ శ్రీ లంక చేరేసరికి 3 కిలోమీటర్లు అవుతుంది. ఇది ఈరోజు ప్రపంచంలో ఆధునిక నిర్మాణరంగంలో(Modern Architecture) అమలుచేస్తున్న డిజైన్. త్రేతాయుగం అంటే 12,96,000 సంవత్సరాల కాలం.ఈ యుగంలోనే శ్రీ రామచంద్రుడు ఈ భూమిపై అవతరించాడు. తరువాత ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఇప్పటికి కలియుగంలో 5113 సంవత్సరములు గడిచాయి. రామసేతువు నిర్మాణం త్రేతాయుగం చివరలో జరిగినది. అంటే దాదాపు 9,00,000 ఏళ్ళ క్రితం. ఈ రోజు మనం చెప్పుకుంటున్న అత్యాధునిక పరిజ్ఞానం మన హిందువులకు కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఋజువేం కావాలి చెప్పండి. హిందువైనందుకు గర్వించండి. Say it with pride : We are Hindus. కొన్ని లక్షల సంవత్సరాలు నీటిలో ఉన్నా, చెడిపోని లోహం(Metal)తో చేసిన bolts వాడి బండలను జతపరిచారని, మధమధ్యలో సున్నం, బంకమట్టి మొదలైనవి వాడారని సేతువును పరీశీలించిన రాజీవ్ దీక్షిత్ మొదలైనవారు పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ప్రదర్శించారు. పైన చెప్పిన వాటితో పాటు ఈ సేతువు సముద్రపు లోతు తక్కువగా(3-30 అడుగులు) ఉన్న ప్రదేశంలో ఉంది. అందువల్ల ఇది సహజంగా ఏర్పడినది కాదనడానికి అనేక ఆధారాలు దొరుకుతున్నాయి. రామసేతువును కాపాడుకుందాం. రామాయణం మనదేశ చరిత్రలో భాగం అని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పుకుందాం. భారత్-శ్రీలంకల మధ్య ఒక వంతెన ఉన్నదని నాసా ఫోటోలు విడుదల చేసినప్పటికి, అది సహజంగా ఏర్పడిన వంతెన అనే చాలాకాలం వాదించింది. దాని వయసు సూమారు 17,50,000 ఏళ్ళు అని చెప్పింది. అక్కడ ఉన్న పగడాలు, యాంటి-బయాటిక్ లక్షణాలు కలిగి అంతరిక్షయానం చేసేవారికి ఉపయోగపడే algae, ఇవన్ని చూశాక అమెరికా భారత్ మీద అసూయతో అనేకవాదనలు చేసింది. అది 17,50,000 సంవత్సరాల నాటిదని చెప్పడం చేత అది శ్రీ రామసేతువు కాదని హిందువులను నమ్మించవచ్చని భావించింది. ఇప్పటికే బ్రిటిషర్లు మహభారత కాలనికి సంబంధించిన ఆధారాలను అనేకం నాశనం చేశారు. రామాయణం ఎప్పుడో జరిగిందో తెలియక, అదంతా ఒక కధగా, ఒక నమ్మకంగా భావిస్తున్నాం. మనకు నిజాలు తెలిసేలోపు ఆధారాలను మాయం చేయాలన్నది అమెరికా ఆలోచన. కానీ నిజం నిప్పులాంటిది. సత్యమేవ జయతే, 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా' అని మనకు మన గ్రంధాలు ప్రస్ఫుటంగా చెప్తున్నాయి. పరమాత్మ సత్యం. సత్యాన్ని ఎవరూ తొక్కిపెట్టలేరు. ఒక జెర్మన్ బృదం రామసేతువు మీద 'కార్బన్ డేటింగ్' చేసి, దాని వయసు 9,00,000 సంవత్సరాలని తేల్చింది. ఇది మన హిందువులు రామావతారం గురించి చెప్పే సమయంతో సరిపోతోంది. 2004లో భారత్ మీద సూనామీ విరుచుకుపడినప్పుడు, ఆ భయంకర అలలు దక్షిన తమిళనాడు, కేరళ మీద పడకుండా ఆపింది రామసేతువు. రామసేతువే కనుక లేకపోయి ఉంటే కొంకణతీర ప్రాంతానికి తీవ్ర నష్టం చేకూరేది. ఇప్పుడు రామసేతువును కూల్చేసి, సేతు సముద్రం ప్రాజెక్టును చేపడితే, భవిష్యత్తులో మరొక సూనామీ వస్తే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు చాలా తీవ్రంగా నష్టపోతాయి. రామసేతువు వలన, దాని దగ్గరి ప్రాంతంలో ఒక different వాతవరణం నెలకొని ఉంది. అక్కడున్నAlgae కు ఔషధ గుణాలున్నాయని 2012 జూలై ప్రాంతంలో కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధించి వెల్లడించారు. అక్కడున్న Algea మీద మరిన్ని పరిశోధనలు చేసి, ప్రజల యొక్క రోగ నిరోధక శక్తిని పెంచగలిగే ఒక మందును తయారు చేయవచ్చని వెల్లడించారు. రామసేతువు వద్ద చాలా అరుదైన marine atmosphere కనిపిస్తుంది. అంతరించబోయే జాబితలో చేర్చబడిన 5 జాతులకు సంబంధించిన జీవరాశికి ఈ రామసేతువే ఆధారం. దీన్ని కూల్చేస్తే అక్కడున్న జీవరాశి పూర్తిగా అంతరించిపోతుంది . సేతు సందురం ప్రాజెక్టు వలన లక్షలమంది జాలర్లు జీవనం కోల్పోతారు. ఈ రోజు ప్రపంచంలో అణువిద్యుత్ ప్లాంట్ల(nulcear plants)కు థోరియం(Thorium) ప్రత్యామ్నాయ ఇధనం(alternative fuel). భారత్ ప్రపంచంలో 25% థోరియం నిలువలు కలిగివుంది. అందులోనూ సగానికి పైగా థోరియం నిలువలు తమిళనాడు సముద్ర తీరంలో రామసేతువు దగ్గరగా ఉన్నాయి. మన దగ్గరున్న థోరియం నిలువలతో భారత్, మరే ఇతర దేశం మీద ఆధారపడే పరిస్థితి లేదు . రామసేతువు, సముద్రపు కెరటాలను అదుపు చేయడంతో పాటు, వాటిని క్రమబద్దీకరించడం వలన అక్కడ Thorium, Titanium అధికంగా ఇసుకలో ఉన్నాయి. సేతు సముద్రం ప్రాజెక్టు పేరుతో రామసేతువును కూల్చేయడం వలన అక్కడ ఉన్న mineral deposits కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. థోరియం ను అక్రమరవాణా చేయడం సులభవుతుంది. అంతేకాదూ, రామసేతువు కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కూడా ఇందుకే. గుట్టు చప్పుడు కాకుండా అక్కడున్న మన జాతి సంపదైన Thoriumను విదేశాలకు తరలించి, అక్రమంగా డబ్బు సంపాదించాలన్నది వారి ఆలోచన. అందుకే ఎంత నష్టం వాటిల్లుతుందని తెలిసినా, వారు రామసేతువును నాశనం చేయాలనే నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. రామసేతువును కూల్చి నౌకలు వెళ్ళెందుకు వీలుగా ఒక మార్గం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే చాలసార్లు ప్రయత్నాలు జరిగాయి కానీ ప్రతిసారి ఎద్దురుదెబ్బలే తగిలాయి. జనతా పార్టీ అధ్యక్షుడు, సుబ్రమణ్యస్వామి రాసిన ఒక రెపోర్టును Asian Age ప్రచురించింది. 23-1-2007 న Asian Age లో ప్రచురింపబడిన దాని ప్రకారం Dredging Corporation of India(DCI) హోలాండ్ నుండి ఒక dredger ను import చేసుకుంది. అది రామసేతువు దగ్గర పని ప్రారంభించడానికి వెళ్ళి, సేతువుకు తగలగానే రెండు ముక్కలై, సముద్రంలో మునిగిపోయింది. Dredger ను సాగరగర్భం నుండి బయటకు తీయడానికి వెళ్ళిన DCI crane కూడా విరిగిపోయి సముద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటనను గురించి ఆరా తీయడానికి వచ్చి, ఆ ప్రదేశానికి వెళ్ళిన రష్యన్ ఇంజనీరుకు ఒక కాలు విరిగింది. గుట్టు చప్పుడు కాకుండా పని కానిద్దాం అనుకున్నారు. ప్రజలను మోసం చేయచ్చు, కాని పరమాత్ముడుని మోసం చేయగలరా? హిమాలయ పర్వతాల్లో, కైలాస మానససరోవరం చుట్టుప్రక్కల ఈ రోజుకి శ్రీ ఆంజనేయ స్వామి వారు తపస్సు చేస్తున్నారు. తన రాముడి సేతువు వద్దక వస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? జై హనుమాన్ రామసేతువు 1480 వరకు వాడుకలో ఉండేది. దాని మీది నుండి ప్రజలు ఇరుదేశాల మధ్య వ్యాపారం కొనసాగించారు. కాని ఆ తరువాతి కాలంలో వచ్చిన ఒక భారీ తుఫాను వలన రామసేతువు 3 నుండి 7 అడుగుల మేర సముద్రంలో మునిగిపోయింది. రాముడిని పూజించే హిందువులున్న పవిత్ర భారతదేశ ప్రభుత్వం రామసేతువును పగులగొట్టాలని ప్రయత్నిస్తుంటే, రావణాసురుడిని ఆరాధించే శ్రీ లంక, అక్కడి ప్రభుత్వం మాత్రం సముద్రం కలిసిన సేతువు మీద ఒక మార్గం నిర్మించి, రామాయణ కాలం నాటి ఆనవాళ్ళను ప్రపంచానికి ప్రదర్శిస్తూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది.


  1. నా అభిప్రాయం.అక్కడ సముద్రం లోతు తక్కువ.ముందే సముద్రగర్భంలో ఒక భౌగోళిక స్వరూపం ఉండి ఉంటుంది.(geological formation.)దానిపై వానరులసాయంతో శ్రీ రాముడు చెట్లు,రాళ్ళు,బండలుతో వారధి నిర్మించి ఉంటాడు.ఇది కష్టమైనా అసాధ్యమైనవిషయం కాదు.
    నీటిలో తేలే ఇటుకలను రామప్ప దేవాలయం దగ్గర కూడా చూసాను.

    ReplyDelete
    Replies
    1. Kamaniyam garu asadyam kadu kada ayite miru emi chestharu ante ma bharatha desam nunchi mi British desam varuku varadhi nirminchandi

      Delete
    2. samudran lothu thakkuva? meeru chusara kamaneeyam gaaru...... chetlu ekkada kuda naata leadu .... and adi bowgolika swarupam kuda kadu.. adi ramudi leela.........

      Delete
  2. ithe meeru nirminchandi kastam kadu annaru kada?

    ReplyDelete
  3. కోతులు వారధి నిర్మించడం అనేది వొక కొత్త్హ కాన్సెప్ట్ కనుక అది అసాధ్యమైన విషయమే దానిని రాముడు ,ఆ కోతులు సాధ్యం చేసి చూపాయి.ఇక చరిత్రకు మనో బోటి అల్పుల వూహలతో ,కల్పనలతో పని ఉండదు మాస్టారూ ..భౌగోళిక స్వరూపం ఉన్నదో లేదో మీరు వెళ్లి చూ సి రాలేదు కదా ?మేరి మీ వఖ్యలో దాని ప్రస్తావన అప్రస్తుతం ..అయన వారధి నిర్మాణంలో చెట్లు వాడారని ఎక్కడా వాల్మికి వర్ణించలేదు కాని మీరు ఆ అపప్రధను కూడా మీ కామెంట్లో చేర్చారు.పురాణాలు-వాటిలోని ఘట్టాలూ మీ వంటి కుహన విమర్సకుల వల్లనే భ్రష్టు పడుతుండటం విచారకరం.రాసే ముందూ-మాట్లాడే ముందూ కొంచం యోచన చేయాలని పెద్దలు వూరికే చెప్పలేదు మరి...

    ReplyDelete
  4. u said that u have seen pubis stones that are used in raama-sethu.@ ramappa temple area...ok its not the qstn wether someone has seen such stones here sir..some times one can not able to use their brain how to use the available sources nd things nd materials near to them.Here in this case the monkeys architect Neela very cleverly used his brain,so in my opinion monkeys r [sometimes] more cleverer than humans..HOPE U WIL AGREE THIS..

    ReplyDelete
  5. Thankyou all... thankyou very much..

    ReplyDelete
  6. what about hindustan for hindus. why we still living italy-vatican government

    ReplyDelete
  7. మన దేశం గురించి తెలుసుకోవడం మానివేయడమే కాకుండా ... విమర్సించడం ఫ్యాషన్ గా మారిపోవడం చాలా బధకలిగించే విషయం.

    ReplyDelete

Whatsapp Button works on Mobile Device only