Sunday, 9 February 2014

పవిత్ర దినం బీష్మ ఏకాదశి

పవిత్ర దినం బీష్మ ఏకాదశి

కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి, తన ఇష్టానుసారం కురు పితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు భీష్మ ఏకాదశి. తిథి నక్షత్రాలను, వార వర్జ్యాలను పాటించేవారు ఏకాదశిని మంచిరోజుగా భావిస్తుంటారు. భీష్మ ఏకాదశిని మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో కథ ఉంది. భీష్ముడి గురించి తెలియని వారుండరు.
మహాభారతంలో భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. మహాభారత గాథకు మూల స్తంభమైన భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇతని మొదటి పేరు దేవపుత్రుడు. శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుంచి గాంగేయుడుభీష్ముడుఅయ్యాడు.

సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చెయ్యడంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్చంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది. యుద్దంలో పదిరోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్భాణానికి నేలకొరిగి శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు. దీన్ని తలపునకు తెచ్చేది ఏకాదశి వ్రతం.
కార్తీక శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్టుగా పలు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్టుగా ప్రమాణాలు ఉన్నాయి. నిర్ణయ సింధువులలోనూ, భీష్మ సింధువులలోనూ, ధర్మ సింధువులలోనూ మాఘ శుద్ధ అష్టమినాడు భీష్మునికి తిలాంజలి విడిచి పూజించాలని ఉంది.
భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని పలువురు అంటున్నారు. కారణంగా భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి. పాండవుల అభిమాని అయిన భీష్ముడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూసే రోజుల్లో ధర్మరాజుకువిష్ణు సహస్త్రనామాలుబోధించాడు. నామాలు గోప్యమయినవే కాదు గొప్పవి కూడా. నామాలకే ఆదిశంకరాచార్యులు భాష్యం చెప్పారు. నామాల సుస్వరాలాపనేసత్యనారాయణ వ్రతం’. వ్రతాన్ని భీష్మ ఏకాదశి రోజున ఆచరిస్తే కోరుకున్నవి నెరవేరుతాయని పెద్దల నమ్మకం. అందుకే అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని భీష్మ ఏకాదశి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో దర్శిస్తారు. వ్రతాన్ని ఆచరిస్తారు. 

భీష్మ పంచకం:
మాఘశుద్ధ సప్తమి మొదలు మాఘశుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకమంటారు. భీష్ముడు అంపశయ్యపై పరుండి ఈనాటి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచప్రాణాలను విడనాడాడని పురాణాలు చెపుతన్నాయి.

భీష్మాష్టమి మాఘశుద్ధ అష్టమి. పద్మపురాణంలోనూ హేమాద్రి వ్రత ఖండంలోనూ దీనిని గురించి చెప్పబడి వున్నది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి ఇచ్చేవారికి సంతాన ప్రాప్తి కలుగుతుది. దీనివల్ల భీష్ముడు రోజుననే మరణించినట్లు తెలుస్తూ వుంది. మహాభారతంలో కూడా రోజునే భీష్ముని నిర్యాణం రోజుగా చెప్పబడింది. భీష్మాష్టమి భీష్ముని నిర్యాణ దినం రోజున భీష్ములకు శ్రాద్ధ తర్పణం చేసిన వారికి సంవత్సరపాపం నశిస్తుందంటారు. పగలు, శుక్ల
పక్షం, ఉత్తరాయణం -- మూడు కాంతిమార్గాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలిపారు. అటువంటి అమృత ఘఢియల్లో వచ్చేవరకు అంపశయ్యపై పరుండి భీష్మాష్టమినాడు ప్రాణాలు వదిలాడు. భీష్ముడు తన పంచ ప్రాణాల్లో ఒకదానిని సప్తమినాడున్నూ, రెండోదానిని అష్టమినాడు, మూడోదానిని నవమినాడు, నాలుగోదానిని దశమినాడు, ఐదోదానిని ఏకాదశినాడు వదిలాడని కొన్ని ప్రాంతాల వారు చెబుతారు. కాని పలు గ్రంథాలలో మాఘశుద్ధాష్టమి బీష్మనిర్యాణ రోజుగా చెప్ప బడింది.. భీష్మ పంచకానికి అది ఆఖరి రోజు. కాలనిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మసింధు, కాలమాధవీయం మున్నగు గ్రంథాలన్నీ మాఘశుద్ధాష్టమి భీష్మ నిర్యాణ దినంగా చెబుతున్నాయి.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only