Thursday, 13 February 2014

విగ్రహారాధన అర్ధం, పరమార్ధం - భక్తి, ధ్యాన మార్గాలు

చాలా మంది వేర్వేరు మతాల మిత్రులు విగ్రహారాధన గురించి మన దేవుళ్ళ చిత్ర పటాల గురించి ఇస్తున్న విమర్శలకు సమాధానమే టపా, నన్ను అపార్ధం చేసుకోకండి...
విగ్రహారాధన భక్తి మార్గములోని ప్రాథమిక మెట్టుగా మన హైందవ సిధ్ధాంతము చెబుతుంది...
పూర్వం గానీ ప్రస్తుతం గానీ ఒక ఉన్నత శక్తి వంతులు... తమ అధ్యాత్మిక శక్తిని విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేస్తారు...
అందువల్ల అవి శక్తివంతమవుతాయి... మన దేవాలయంలో భగవంతుని మూర్తిని చూడగానే మనం పొందే ఆధ్యాత్మిక భావన అదే...
భావనను పామరులకు కూడా గుర్తుంచుకునే మార్గమే విగ్రహారాధన... అంటే విగ్రహాన్ని చూడగానే మనం పొందే అధ్యాత్మిక భావన...
దివ్య శక్తిని పొందిన భావన విగ్రహాన్ని గుర్తుకు తెచ్చుకున్న ప్రతిసారి పొందే విధంగా మనం తయారు కావాలి..
అప్పుడే విగ్రహారాధనకు నిజమయిన విలువ ఇచ్చిన వారమవుతాము...
చాలా మంది.. అనుకున్నట్లు శిల్పి తయారు చేసిన విగ్రహానికి కాదు శక్తి ఉండేది... అలా అయితే ప్రతి శిల్పి గొప్ప భగవంతుడయ్యే వాడు... విగ్రహానికి నిజంగా శక్తి సంపన్నయుతమయ్యేది ప్రాణ ప్రతిష్ట తర్వాతే...
ఇంకొక్క విషయం.. అన్ని విగ్రహాలకు ఒకే రక మయిన శక్తి ఉండదు.. ఎందుకంటే అన్నింటికీ ప్రాణ ప్రతిష్ట చేసేది ఒక్కరు కాదు కాబట్టి...
విగ్రహం యొక్క శక్తి దానికి ప్రాణ ప్రతిష్ట చేసే వ్యక్తి యొక్క మహత్యం మీద ఆధారపడి ఉంటుంది... శక్తి ఎన్ని సంవత్సరాలు వస్తే.. అన్ని సంవత్సరాలు ఆలయం వర్దిల్లుతుంది.. అది అలయంలో నిత్యం జరిగే పూజలు, శ్రీచక్ర ప్రభావం మీద ఆధార పడి ఉంటుంది...
  తర్వాత మరల విగ్రహానికి పునః ప్రతిష్ట చేయవలసి వస్తుంది...
కారణం చేతనే చాలా ఆలయాలు శిథిలమయ్యేది.. తిరిగి పునఃప్రతిష్ట చేయబడేది...
విగ్రహాలు, గోడకు తగిలించిన చిత్తరువులు ఇవన్నీ మనలో భావనను  నిరంతరం గుర్తుంచుకొనే దానికే... వాటికి విడిగా శక్తి ఉందా లేదా అనే మీమాంస అనవసరం...
మన ఆధ్యాత్మిక ప్రయాణం కేవలం విగ్రహారాధనతో అంతమవ్వకూడదు..
ఇంకా ముందుకు సాగాలి.. అప్పుడు మనలో ప్రవహించే విశ్వాంతర ఈశ్వరీయ దివ్య శక్తిని ఎక్కడినుండయినా గ్రహించ వచ్చు...
(ఉదాహరణకు మనం టెలివిజను నుండి గ్రహించే ప్రసారాలు... ఒకే టివి లో వేర్వేరు చానెల్స్ నుండి వేర్వేరు ప్రసారాలు ఎలా చూస్తామో... వేర్వేరు మత సిద్దాంతాలు వేర్వేరు విధాలుగా శక్తిని ప్రసారం కావిస్తాయేమో .. )
శక్తిని నిజంగా ఒక సారి రుచి చూడగలిగితే... ఇప్పుడు మనం అనుభవించే ఇహలోక సుఖాలేవి లెక్కలోకి రావు..
మన హిందూ మతంలో అన్య మతాలను ఆదరించటానికి గల కారణం...  శక్తిని గుర్తించగలగటమే...
మన మది నుండి ఉద్భవించినదే మతం... మన మదిలో మతం యొక్క రెండవ చివరనే ఆధ్యాత్మికత ఉంటుంది...
మొదలు దగ్గరే ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలనేదే మా గురువు గారు ఉధ్భోదించిన భావన...






Post a Comment

Whatsapp Button works on Mobile Device only