Thursday, 13 February 2014

నువ్వు ఎప్పడు నీ విలువను పోగొట్టుకోలేవు

ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి, 200 మంది ఉన్న
గదిలో ఉపన్యాసం ఇస్తున్నాడు.
తన జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోట్ ని
తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు.
ఆ గదిలో ఉన్న 200 మంది చేతులు గాలిలోకి లేపారు.
సరే ఈ వెయ్యి రూపాయలని మీలో ఒకలికి
తప్పకుండ ఇస్తాను అని ఆ వెయ్యి రూపాయలని
బాగా మడతలు పడేలే నలిపెసాడు.
మరల తను ఇప్పుడు ఇది ఎవరికీ కావాలి అన్నాడు.
మళ్లీ అందరు చేతుల్ని లేపారు. తను మంచిది అని
వాళ్ళతో అని మరల ఆ వెయ్యి రూపాయలని కింద
పడేసి తన కాళ్ళతో తో తోక్కేసాడు. అప్పుడు అది
(వెయ్యి రూపాయలు) బాగా మడతలు పడి, మట్టి
కొట్టుకుపోయింది.
మరల అతడు దాన్ని తీసి ఇప్పుడు ఇది
ఎంతమందికి కావాలి అన్నాడు.
ఇప్పుడు కూడా అందరు తమ చేతులు పైకెత్తారు.
అప్పుడు అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా
చెప్పాడు...
నా మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి
పాఠాన్ని నేర్చుకున్నారు.
ఇప్పటి వరకు ఈ వెయ్యి రూపాయల్ని ఏమి
చేసిన మీరందరూ ఇంకా కావాలి అంటున్నారు.
ఎందుకంటే నేను ఏమి చేసిన ఈ వెయ్యి
రూపాయల విలువ ఏ మాత్రం తగ్గలేదు.
ఇది ఇప్పటికి వెయ్యి రూపాయలు.
అలాగే మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో
మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకి ఎన్నో
ఎదురు దెబ్బలు తగులుతుంటాయి..
కొన్ని సార్లు కిందకి పడిపోతాం. కొన్ని
సార్లు మనం ఎందుకు పనికిరాము అనుకుంటాం.
కానీ ఏమి జరిగింది, ఏమి జరగబోతుంది అనేది పెద్ద
విషయం కాదు.
"నువ్వు ఎప్పడు నీ విలువను పోగొట్టుకోలేవు".
"నువ్వు ఒక గొప్ప వ్యక్తివి" ...
ఈ విషయం ఎప్పటికి మరవొద్దు.


Post a Comment

Whatsapp Button works on Mobile Device only