శుక మహర్షి వేద వ్యాస మహర్షి యొక్క కుమారుడు....
శుక మహర్షి కి సంబంధించిన వృత్తాంతం ఆయన జన్మ గురించిన రహస్యం వేరువేరు విధాలుగా మనకి కనబడుతున్నాయి...
పూర్వం మహర్షుల యొక్క శక్తి యుక్తులు తర్వాతి తరాలకు అందజేయాలి అనే ఉద్దేశంతో వారికి కుమారుల కోసం ఇంద్ర సభలో నుంచి అప్సరసలను పంపించేవారట... అలా ఘ్రుతాచి అనే అప్సరసను వ్యాస మహర్షికి పంపించినప్పుడు వ్యాస మహర్షి శక్తిని చూసి తట్టుకోలేక అప్సరస ఒక చిలుక రూపం దాల్చిందట.... అలా వారికి చిలక రూపంలో జన్మించిన వాడే శుక మహర్షి అని ఒక కథనం...
అయితే మరొక కథనంలో వ్యాస మహర్షి భార్య వాటిక గర్భం దాల్చిన దాదాపు 12 సంవత్సరాల దాకా ప్రసవం రాలేదట.... ఆ బాధను తాడలేక ఆవిడ చాలా బాధపడుతుంటే వ్యాస మహర్షి వారు లోపల ఉండే బాలుడి వృత్తాంతం దివ్య దిష్టి ద్వారా తెలుసుకుని ఆ బాలునితో సంభాషించాడు... అప్పుడు తెలిసిందేమిటంటే అతను కొన్ని లక్షల జన్మల నుండి తిరిగి తిరిగి జన్మిస్తున్నారు ఆయన గత జన్మల సంస్కారముల వలన ఆ చతుష్షష్టి కళల గురించిన అవగాహన అంతే ఉండిపోయిందని.. ఒకవేళ భూమి మీద జన్మించగానే మాయ ప్రభావం వలన వాటిని మరచి పోతానేమో నని భయపడి లోపలే ఉండిపోయారట... శ్రీకృష్ణుల వారు అలా జరగకుండా చూస్తాను అని హామీ ఇచ్చిన తర్వాతే శుక మహర్షి జననం జరిగింది అని ఒక కథనం...
ఈ 64 కళలను చతుష్షష్టి కళలు అంటారు..
ఈ 64 కళలను ఉజ్జయినిలోని సాందీపని మహర్షి దగ్గర బలరాముడుతో పాటు శ్రీకృష్ణ భగవానులవారు 64 రోజులలో నేర్చుకున్నారట ... సామాన్య మానవులకు ఒక్కొక్క కళ్ళను అభ్యసించాలంటే కనీసం రెండున్నర సంవత్సరాలు పడుతుంది అట...
64 కళ లు అంటే ఉత్త arts (కళలు) అని అనుకోకూడదు ప్రతి కళ కూడా మనకి జీవనోపాధి కలిగించి మన జీవనాన్ని నిలబెట్టి మన భావితరాల వారికి కూడా కావలసినంత సంపదను అందించగలరు... ఇవి ఎన్ని రకాల ప్రొఫెషన్స్ ను తయారు చేశాయో ప్రతి కళ గురించి మీరు చదివితే అర్థం అవుతుంది క్రింద ఆ 64 రకాల కళలను మరియు ఆ 14 శాస్త్రములను కూడా ఉంచాను ఇవి ఒక తరం నుంచి ఇంకొక తరానికి వెళ్లేటప్పుడు కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటూ అభివృద్ధి అవుతూ కొన్ని ఎలిమినేట్ అవుతూ ముందుకు సాగుతూ ఉంటుంది.... గమనించగలరు
1. ఇతిహాసము (వేదములు ( ఋగ్వేదము, యజుర్వేదము , సామవేదము , అధర్వణ వేదము అనేవి మనకు నాలుగు వేదాలు ) )
2. వేదాంగములు - వేదములకు సంబంధించిన ఆరు శాస్త్రములు (1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని ఆరు వేదాంగములు ( శాస్త్రములు )
3. ఇతిహాసములు - రామాయణ , మహాభారత , భాగవతం పురాణాదులు.
4. ఆగమశాస్త్రములు - 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము
4 స్మార్తాగమము అని నాలుగు ఆగమములు కలవు.
5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు
6. కావ్యాలంకారములు : సాహిత్యశాస్త్రము
7. నాటకములు
8. గానము ( సంగీతం )
9. కవిత్వము ఛందో బద్ధముగా పద్యమును గాని శ్లోకమును గాని రచించడము
10. కామశాస్త్రము
11. ద్యూతము ( జూదమాడడము ) జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీటికే అక్షసూక్త మని అందురు .
12. దేశభాషాజ్ఞానం
13. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయు విధానము.
14. వాచకము = ఏ గ్రంధమైననూ తప్పు లేకుండ వినసొంపుగా అర్థవంతముగా చదువు నేర్పునది .
15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన ,నేత్రాథానాది , అవధానములలో నైపుణ్యము
16. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినది ఇడా , పింగళా , సుషుమ్న , నాడులకు సంబంధించి చెప్పబడు శుభాశుభ ఫలాలు తెలిపే శాస్త్రము,
17. శకునము= ప్రయాణ సమయములో పక్షులు జంతువులు మానవులు , ఎదురు రావడం గురించి పక్కకు తప్పుకోవడం ఆయా శకునం గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల తెలిపే శాస్త్రము
18. సాముద్రికము= హస్త రేఖలు , బిందువులు , వగైరాలను గుర్తించి శుభాశుభముల తెలుసుకునే శాస్త్రము
19. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణ జ్ఞానం
20. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము
21. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము
22. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము
23. మల్లవిద్య = కుస్తీలు పట్టులో నైపుణ్యతను తెలిపే విధానము
24. పాకకర్మ= వంటలు చేయటలో ప్రావిన్యత .
25. దోహళము=వృక్షశాస్త్ర పరిజ్ఞానం.
26. గంధవాదము = పలురకాల సువాసన వస్తువులు అత్తరు ,పన్నీరు వంటివి తయారుచేసే విధానం తెలిపేది .
27. ధాతువాదము = రసాయన వస్తువులు తెలుసుకునే విద్
య
28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .
29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.
30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ ఉండే విద్య .
31. జలస్తంభన - నీళ్ళను గడ్డ కట్టించి దానిపై నడిచే విద్య .
32. వాయుస్తంభన - గాలిలో తేలియాడే విద్య.
33. ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గ,ఆయుదాలను నిలిపివేసే విద్య
34. వశ్యము - పరులను లోబరచుకొను విద్య
35. ఆకర్షణము - పరులను ఆకర్షించే విద్య,
36. మోహనము - పరులను మోహింపజేయు .
37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,
38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటు నుండి వెళ్ళ గొట్టడము,
39. మారణము - పరులకు ప్రాణహాని కలిగించడము.
40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.
41. వాణిజ్యము - వ్యాపారాదులు.
42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.
43. కృషి - వ్యవసాయ నేర్పరితనం.
44. ఆసవకర్మ - ఆసవములను , మందులను చేయు రీతి
45. లాపుకర్మ - పశు పక్ష్యాదులను స్వాధీన పరచుకొను రీతి.
46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పరితనం.
47. మృగయా - వేటాడు నేర్పరితనం.
48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పరితనం.
49. అద్మశ్యకరణీ - పరులకు కనబడని రీతిగా మెలంగడము.
50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పరితనం.
51. చిత్ర - చిత్రకళలో నేర్పరితనం.
52. లోహా - పాత్రలు చేయిటలో నేర్పరితనం.
53. పాషాణ - రాళ్ళు చెక్కడములో నేర్పరితనం (శిల్పకళ)
54. మృత్ - మట్టితో చేయు పనులలో నేర్పరితనం.
55. దారు - చెక్కపని చెక్కడములో నేర్పరితనం.
56. వేళు - వెదరుతో చేయు పనులలో నేర్పరితనం.
57. చర్మ - తోళ్ళ పరిశ్రమలో నేర్పరితనం..
58. అంబర - వస్త్ర పరిశ్రమలో నేర్పరితనం.
59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పరితనం.
60. ఓషథసిద్ధి - మూలికల ద్వారా కార్య సాధనా విధానము.
61. మంత్రసిద్ధి - మంత్రముల ద్వారా కార్య సాధనము.
62. స్వరవంచనా - కంఠ ధ్వని వలన ఆకర్షణము.
63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము.
64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల, మహేంద్ర జాలములు తలచినచోటికి వెల్లండం ,సృష్టించడం ఇవి గారడీ విద్యలు
లలితకళలు:
చిత్రలేఖనము, శిల్పము, సంగీతము, నృత్యము, కవిత్వము(కావ్యం) ఈ ఐదింటిని లలితకళలు అంటారు. వీటినే ఆంగ్లంలో Fine Arts అంటారు.
Post a Comment