Manidweepa Varnana (Telugu) – మణిద్వీపవర్ణన
మహాశక్తి మణిద్వీప నివాసినీ ముల్లోకాలకు మూలప్రకాశినీ |
మణిద్వీపములో మంత్రరూపిణీ మన మనసులలో కొలువైయుంది ||౧ ||సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు |
అచంచలంబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు ||౨ ||
లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు |
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు ||౩ ||
పారిజాతవన సౌగంధాలు సూరాధినాధుల సత్సంగాలు |
గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు ||౪ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు |
మధుర మధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు ||౫ ||
అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారు శక్తులు |
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు ||౬ ||
అష్టసిద్ధులు నవనవనిధులు
అష్టదిక్కులు దిక్పాలకులు |
సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు ||౭ ||
సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు ||౭ ||
కోటిసూర్యుల ప్రచండ కాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు |
కోటితారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు ||౮ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు |
ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు ||౯ ||
పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు |
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ||౧౦ ||
ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు |
పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు ||౧౧ ||
సప్తకోటిఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు |
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు ||౧౨ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
మిలమిలలాడే ముత్యపు రాశులు తళతళలాడే చంద్రకాంతములు |
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు ||౧౩ ||
కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాల నొసగే అగ్నివాయువులు |
భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు ||౧౪ ||
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు |
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు ||౧౫ ||
కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు |
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు ||౧౬ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
మంత్రిణి దండిని శక్తిసేనలు కాళి కరాళీ సేనాపతులు |
ముప్పదిరెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు ||౧౭ ||
సువర్ణ రజిత సుందరగిరులు అనంగదేవి పరిచారికలు |
గోమేధికమణి నిర్మితగుహలు మణిద్వీపానికి మహానిధులు ||౧౮ ||
సప్తసముద్రములనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు |
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు ||౧౯ ||
మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు |
సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు ||౨౦ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు |
పదారురేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు ||౨౧ ||
దివ్యఫలములు దివ్యాస్త్రములు దివ్యపురుషులు ధీరమాతలు |
దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు ||౨౨ ||
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు |
మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు ||౨౩ ||
పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు |
సంతానవృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు ||౨౪ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాశులు |
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు ||౨౫ ||
దుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు |
ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు ||౨౬ ||
పదునాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము కలదు |
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానం ||౨౭ ||
చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన |
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో ||౨౮ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
మణిగణఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరిదాల్చి |
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో ||౨౯ ||
పరదేవతను నిత్యముకొలచి మనసర్పించి అర్చించినచో |
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ||౩౦ ||
నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు |
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు ||౩౧ ||
శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట |
తిష్టవేసుకుని కూర్చొనునంట కోటిశుభాలను సమకూర్చుటకై ||౩౨ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
To Read chant Manidweepa varnana without mistakes follow the video
Tags:
Mani dweepa Varnana in telugu pdf free download, మణిద్వీపవర్ణన in telugu, manidweepa varnana chant read without mistake, manidweepa varnana,
Post a Comment