Tuesday 13 April 2021

అధిక మాసం అంటే ఏమిటి దానిని ఎలా గణిస్తారు??

అధిక మాసం.. ఈ పదాన్ని అప్పుడప్పుడు వింటూవుంటాం. ఇంతకీ ఆ మాసమేంటి? అది ఎందుకు వస్తుంది? అనే ప్రశ్నలకు కొందరి దగ్గర జవాబులు వుండవు. ఆ విషయాలను ఓసారి పూర్తిగా తెలుసుకుందాం...   
సౌర మానం అంటే... సూర్య గమనం ప్రకారం ఏర్పడే కేలండర్ అన్నమాట...ఈ కాలమానాన్ని తమిళనాడు వారు ఉపయోగిస్తారు... ఈ కేలండర్ ఋతువులు మారే క్రమము perfect గా చూపించ గలుగుతుంది...

మనం భూమి మీద నుంచి గమనించినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి చుట్టూ దాదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. అలా ఒక నిశితంగా ఒక సంవత్సరం పాటు చాలా సార్లు పరిశీలించిన మన పెద్దలు... భూమి ఒక నిర్ణీత కక్ష్యలో తిరిగేటపుడు ఒక ప్రత్యేక నక్షత్ర సమూహాలను దాటుతూ వెళ్ళడాన్ని ఆయా సమూహాలలో ఉన్నప్పుడు వాతావరణం ఒక్కొక్కలా ఉండడం గమనించారు... అలా మొత్తం 12 సమూహాలను గమనించారు... సమూహాలను రాశులు అని కూడా అంటారు... అలా ఏర్పడిన రాశులు... 12...   ఈ నక్షత్రాల గుంపులు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన ఆకారంలో కనిపిస్తాయి.

 ఆ ఆకారాలను బట్టి వాటికి 
 1. మేషం, 
 2. వృషభం, 
 3. మిథునం, 
 4. కర్కాటకం, 
 5. సింహం, 
 6. కన్య, 
 7. తుల, 
 8. వృశ్చికం,
 9. ధనుస్సు, 
 10. మకరం, 
 11. కుంభం, 
 12. మీనం అని పేర్లు పెట్టారు. 

 సూర్యుడు ఈ రాశి చక్రాన్ని చుట్టి రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది. (నిజానికి ఇది భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం.) అంటే సూర్యుడు ఒక సంవత్సరకాలంలో పన్నెండు రాశుల్ని దాటి మొదటికి వస్తాడన్నమాట. ఒక రాశినుండి ఇంకొక రాశికి మారడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు... ఇలా మకరరాశిలో జరిగే సంక్రమణం మనకు పెద్ద పండుగ అయిన మకర సంక్రాంతి) అంటే ఒక్కో నక్షత్ర రాశిలోనూ దాదాపు ఒక్కో నెల ఉంటాడు. ఇది సౌర మానం. 

సూర్యమాన కేలండర్ ప్రకారం సూర్యోదయం ప్రాతి పదిక.. కానీ మన ప్రకృతి (ఉదా: పౌర్ణమి నాటి సముద్రానికి ... అమావాస్య నాటి సముద్రానికి తేడా ఉంటుంది..  సరీసృపాలు... పాముల్లాంటివి కుబుసాన్ని వదిలేది... మహిళల ఋతుక్రమం.. మొదలైనవన్నీ... ) చాంద్రమానంప్రకారం నడుస్తున్నట్లుగా పెద్దవారు గ్రహించారు...కానీ చాంద్రమానం ప్రకారం సూర్యోదయం ఉన్నప్పుడు ఉన్న చంద్రుడి స్థితి ఆరోజు అవుతుంది.... అందుకే ఈ రెండిటి పొంతన ఉండదు.... (కొన్ని పండుగలు రెండు రోజులు రావడానికి ఇదే కారణం..)కానీ దానిని కూడా మనవారు సమన్వయ పరిచారు.. 

ప్రపంచంలోని ఏ కేలండర్ మన పంచాంగంలా ప్రతిరోజును సంవత్సరాన్ని నిర్ణయించలేదు... ఇప్పటికీ ఆయా ఋతువులలో సూర్యోదయం ఎప్పుడవుతుంది.. చంద్రోదయం ఎప్పుడవుతుంది లాంటివి చాలా clear గా పంచాంగంలో mention చేస్తారు... ఎంత perfectness లేకపోతే ఇది సాధ్య మవుతుంది... 

 సాధారణంగా.. ఒక నెలను కొలవటానికి చంద్రుడు భూమిచుట్టూ తిరగడాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. చంద్ర మానం అంటే ఏమిటి ? చంద్రుడు భూమికి ఉపగ్రహము . చంద్రుడు భూమిని చుట్టివచ్చే గమనాన్ని బట్టి చేసిన కాలగణనను చాంద్రమానము అంటారు . పడమర నుండి తూర్పుకు తిరుగుతూ చంద్రుడు 27 1/3 రోజులకు ఒకసారి భూప్రదక్షిణ పూర్తిచేస్తాడు .
భూమిచుట్టూ చంద్రుడు ఒక్కసారి తిరిగితే అది నెల కింద లెక్క. దానినే చాంద్రమానం అని అంటారు. అయితే.. అలా 12 రాశులలో చంద్రుడు తిరిగిన సమయాన్ని మనం సంవత్సరం కింద లెక్కపెట్టలేం. ఎందుకంటే.. సూర్యమానానికి, చంద్రమానానికి మధ్య పదకొండుంపావు రోజుల తేడా వుంది కాబట్టి. 

ఒక చాంద్రమాన మాసం (అంటే శుక్ల పాడ్యమి నుండి అమావాస్య) లో సూర్యుడు రాశి సంక్రమణం చెందక పోతే ఆ మాసమే అధిక మాసం అవుతుంది... అందుకే ఆ మాసం మన తిథులు పుణ్య కార్యాలు లాంటివి చేసుకునేందుకు ఉపయోగపడదు అని... original గా ఉన్న మాసం మళ్ళీ యథా విథిగా ఉంటుంది... ఇలా చేయడం వలన అధికమాసపు వ్యవథి రోజులు మారుతూ ఉంటుంది... ఇంత adjustment ఉండడం వలన ప్రతి పండుగ ఋతువులకు (seasons) అనుగుణంగా వస్తూ... ప్రతి పండుగా వాటి Orizinal Flavour పోకుండా ఉంటుంది... 
పండుగ flavour అంటే ...

ఉదా:
ఏరువాక పున్నమి కి ఒక వారం రోజుల్లోపు వర్షం వస్తుంది... 
వినాయక చవితి నిమజ్జనానికి దాదాపు ప్రతి చెరువు నిండి ఉంటుంది....
కార్తీక పున్నమికి దాదాపు చలి peaks కు వెళుతుంది... 
రథ సప్తమికి ఎండలో చురుకు మొదలవుతుంది...
శివరాత్రికి చలి శివశివా అంటూ వెళ్ళిపోతుంది...
హోలీకి చెట్ల ఆకులన్నీ రాలి.. కొత్త చిగుళ్ళకు ready గా ఉంటుంది..
ఉగాది కి అంతా క్రొత్త పూత వచ్చి... ప్రకృతి అంతా కొత్తగా ఉంటుంది..
శ్రీరామ నవమికి .. ఒక్క చినుకైనా రాలుతుంది... శ్రీసీతారాముల పెళ్ళికి అక్షింతలుగా... 

ఇలా ప్రతి పండుగ ఒక ప్రత్యేక ఋతు సంబంధ లక్షణాలను కలిగి ఉంటుంది.. 

పంచాంగ గణనం ప్రకారం.. సంవత్సరాన్ని సౌరమాన, చాంద్రమాన పద్ధతులలో లెక్కిస్తారు. ఈ రెండు సంవత్సరాలకు మధ్య పదకొండుంపావు రోజుల తేడా వుంటుంది. వాటిల్లో సౌరమాన సంవత్సరం కంటే చాంద్రమాన సంవత్సరం తక్కువ వ్యవధి కలిగి వుంటుంది. అదేవిధంగా చాంద్రమాన మాసం కూడా చిన్నదే. ఈ తేడా కారణంగా అప్పుడప్పుడు చాంద్రమాన మాసంలో సౌరమానం ప్రారంభం కాదు. అలాంటి సందర్భంలో సూర్య సంక్రాంతి లేని చాంద్రమాసానికి ‘అధికమాసం’ అని పిలువడం జరుగుతుంది. సౌరమానం, చంద్రమానాల్లో వున్న తేడా కారణంగా సూర్యుడు ఒకే రాశిలోనే ఒక నెలకంటే ఎక్కువకాలం సంచరించాల్సి వస్తుంది. దానినే అధికమాసం అంటాం. ఇందులో మొదటి నెలలో రవి సక్రాంతి వుండదు. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటాం. ఈ ఏడాదిలో జూన్ 17వ తేదీ నుంచి అధిక ఆషాడమాసం వచ్చింది.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only