Tuesday 24 June 2014

తెలుగు సంవత్సరములు - ఆ సంవత్సర ఫలితములు


తెలుగు సంవత్సరములు ::
సంవత్సరము యొక్క ఫలితము

1ప్రభవ : యజ్ఞములు ఎక్కువగా జరుగును
2విభవ : ప్రజలు సుఖంగా జీవించెదరు
3శుక్ల : సర్వ శస్యములు సమృధిగా ఉండును
4ప్రమోద్యూత : అందరికీ ఆనందానిచ్చును
5ప్రజోత్పత్తి : అన్నిటిలోనూ అభివృద్ది
6అంగీరస : భోగములు కలుగును
7శ్రీముఖ : లోకములన్నీ సమృధ్దిగా ఉండును
8భావ : ఉన్నత భావాలు కలిగించును
9యువ : ఇంద్రుడు వర్షాలు కురిపించి సమృద్దిగా పండించును
10ధాత : అన్ని ఓషధులు ఫలించును
11ఈశ్వర : క్షేమము - అరోగ్యాన్నిచ్చును
12 బహుధాన్య: దెశము సుభీక్షముగా ఉండును
13ప్రమాది : వర్షములు మధ్యస్తముగా కురియును
14విక్రమ : సశ్యములు సమృద్దిగా పండును
15వృష : వర్షములు సమృద్దిగా కురియును
16చిత్రభాను : చిత్ర విచిత్ర అలంకారాలిచ్చును
17స్వభాను : క్షేమము,ఆరోగ్యానిచ్చును
18తారణ : మేఘములు సరైన సమయములో వర్షించి సమృద్దిగా ఉండును
19పార్ధివ : సంపదలు వృద్ది అగును
20వ్యయ : అతి వృష్టి కలుగును
21సర్వజిత్తు : ప్రజలు సంతోషించునట్టు వర్షాలు కురియును
 22సర్వధారి : సుభీక్షంగా ఉండును
23విరోధి : మేఘములు హరించి వర్షములు లేకుండా చేయును
 24 వికృతి : భయంకరంగా ఉండును
25ఖర : పుషులు వీరులగుదురు
26నందన : ప్రజలు ఆనందంతో ఉండును
27 విజయ : శత్రువులను సం హరించును
 28 జయ : శత్రువులపైనా,రోగములపైనా విజయం సాధిస్తారు.
29 మన్మధ : జ్వరాది భాదలు తొలిగిపోవును
30 దుర్ముఖి : ప్రజలు దుఖర్మలు చేయువారగుదురు
31హేవళంబి : ప్రజలు సంతోషంగా ఉండును
32విళంబి : సుభీక్షముగా ఉండును
33వికారి : శత్రువులకు చాలా కోపం కలింగించును
34శార్వరి : అక్కడక్కడా సశ్యములు ఫలించును
35ప్లవ : నీరు సమృద్దిగా ఫలించును
36శుభకృతు : ప్రజలు సుఖంగా ఉండును
37శోభకృతు : ప్రజలు సుఖంగా ఉండును
38క్రోధి : కోప స్వభావం పెరుగును
39విశ్వావసు : ధనం సమృద్దిగా ఉండును
40పరాభవ : ప్రజలు పరాభవాలకు గురి అగుదురు
41ప్లవంగ : నీరు సమృద్దిగా ఉండును
42కీలక : సశ్యం సమృద్దిగా ఉండును
43సౌమ్య : శుభములు కలుగును
44సాధారణ : సామాన్య శుభాలు కలుగును
45విరోధికృతు : ప్రజల్లో విరోధములు కలుగును
46పరీధావి : ప్రజల్లో భయం కలిగించును
47ప్రమాదీచ : ప్రామాదములు ఎక్కువగా కలుగును
48ఆనంద : ఆనందము కలిగించును
49రాక్షస : ప్రజలు కఠిణ హృదయిలై ఉండెదరు
50నల : సశ్యం సమృద్దిగా ఉండును
51పింగళ : సామాన్య శుభములు కలుగును
52కాళయుక్తి : కాలయిక్తమయునది
53సిద్ధార్ధి : అన్ని కార్యములు సిద్దించును
54రౌద్రి : ప్రజలకు భాద కలిగించును
55దుర్మతి : వర్షములు సామాన్యముగా ఉండును
56 దుందుభి : క్షేమము,ధాన్యాన్నిచ్చును
57రుధిరోద్గారి : రక్త ధారలు ప్రవహించును
58రక్తాక్షి : రక్త ధారలు ప్రవహించును
59క్రోధన : జయమును కలిగించును
60అక్షయ : లోకములో ధనం క్షీణించును

Collected Post from Print media

Post a Comment

Whatsapp Button works on Mobile Device only