Tuesday, 10 June 2014

భారతీయ రైల్వే వ్యవస్థకు సంభంధించిన కొంత చరిత్ర :: Few historical moments in Indian Railways


భారతదేశంలో మొదటి సారిగా రైలు 22 డిసెంబర్ 1851న నడుపబడింది. ఇది రూర్కీలో నిర్మాణ సామాగ్రిని తరలించడానికి వినియోగించబడింది.

16 ఏప్రిల్ 1853లో మొదటి ప్రయాణీకుల రైలు బోరిబందర్, బొంబాయి, థాణేల మధ్య నడుపబడింది.

భారత దేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన రైలు స్టేషన్లు వరుసగా భవానీ మాండీ ఇది మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ సరిహద్దులలో ఉంది. నవాపూర్ ఇది మహారాష్ట్రా మరియు గుజరాత్ సరిహద్దులలో ఉన్నది. జరాయ్‌కేలా ఇది ఒరిస్సా మరియు జార్ఖండ్ సరి హద్దులలో ఉన్నది. ఒరిస్సా మరియు జార్ఖండ్ సరి హద్దులలో ఉన్న మరో రైల్వే స్టేషన్ బార్బిల్
.
భారతదేశంలో అత్యంత చిన్న పేరున్న రైల్వే స్టేషన్ ఇబ్. ఇది ఒరిస్సా లోని ఝూర్స్ గూడా సమీపంలో ఉన్నది.

భారతదేశంలో పెద్ద పేరున్న రైల్వే స్టేషన్ వెంకట నరసింహరాజు వారి పేట. ఇది అర్కోణమ్ మరియు రేణిగుంట రైలు మార్గంలో ఉన్నది.

భారతదేశంలో అత్యంత తక్కువ దూరం ప్రయాణిచే రైలు నాగపూర్ నుండి అంజి వరకు ప్రయాణం చేస్తుంది.ఈ రైలు ప్రయాణం చేసే దూరం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే.

భారతదేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు కన్యాకుమారి కుమారి నుండి దిబ్రూఘ‌డ్‌టౌన్‌ వరకు ప్రయాణించే వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇది 110 గంటల సమయంలో 4273 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది.

భారతదేశంలో అత్యంత తక్కువ మధ్య దూరం ఉన్న రైలు స్టేషన్లు సఫిల్ గూడ దయానంద సాగర్. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 170 మీటర్లు మాత్రమే.

భారతదేశంలో ఉన్న అత్యంత పొట్టి రైలు కొసాంబ్ ఉమర్‌పడ వరకు ప్రయాణిస్తుంది. దీనికి కేవలం 3 భోగీలు మాత్రమే ఉన్నాయి.

భారతదేశంలో అత్యంత ఆలస్యంగా వచ్చే రైలు గౌహతి. ఇది గౌహతి నుండి తిరువనంత పురంవరకు సరాసరి 10 నుండి 12 గంటల ఆలస్యంగా ప్రయాణం చేస్తుంది. దీని ప్రయాణ సమయం 63.05 గంటలు.

భారతదేశంలో ఉన్న అత్యంత పొడవైన రైలు స్టేషన్ పశ్చిమ బెంగాలు లోని ఖరగ్‌పూర్. దీని పొడవు 1072.5 మీటర్లు.

భారతదేశంలో మూడు గేజుల పట్టాలు ఉన్న స్టేషన్ పశ్చిమ బెంగాల్ లోని న్యూజల్సాయ్ గురి.

భారతదేశంలో అత్యధిక మార్గాలు ఉన్న రైలు జంక్షన్ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మ‌థుర‌.

  1. భారతదేశంలో ఉన్న అత్యంత పొడవైన రైలు స్టేషన్ పశ్చిమ బెంగాలు లోని ఖరగ్‌పూర్. ఇప్పుడు గోరఖ్ పూర్ అండీ! దీని పొడవు దాదాపు 1.3 కిలో మీటర్లు.

    ReplyDelete

Whatsapp Button works on Mobile Device only