Thursday 26 June 2014

1G,2G, 3G, 4G , 5G అంటే ఏమిటి?? వీటి మధ్యగల ప్రధాన తేడాలు ఏమిటి?? ఉపయోగాలు ఏమిటి?? పూర్తిగా 5G సాంకేతికతతో కూడిన జీవితం ఎలాఉంటుంది!! తెలియాలంటే ఈ పోస్ట్ ను చూడండి


1G,2G, 3G, 4G,5G అంటే ఏమిటి?? 

వాటి మధ్య తేడా ఏమిటి??

జి - అంటే జనరేషన్ (తరం) "జనరేషన్"
దాదాపుగా మీకు అర్థం అయినట్లే... 
మొదటి తరానికి రెండవతరానికి అభివృద్ధి ఖచ్చితంగా ముందంజ వేయాలి...

 మొదటి తరం(1G): 

మన పాతతరం వైర్ లెస్ టెలిఫోన్ సెట్లు అన్నమాట... 

ఇక్కడ సిగ్నల్స్ ను అందుకునేది.. పంపించేది మొత్తం “అనలాగ్” పద్ధతిలో సాగుతుంది..
అందువల్ల మనం డేటాను టెక్స్ట్ మెస్సేజ్ మరియు సాధారణ కాల్స్ మాత్రమే చేసుకోవడానికి వీలుంటుంది... 
వీటి వేగం 2.4kbps.
 AMPS అనేది US లో మొదలయిన మొదటి 1G ఫోన్
 ఇవి 1980 - 1990 మధ్యలో పనిచేయడం ప్రారంభించాయి..
 ఇవన్ని ఒక పరిమితమైన వనరులలో నెట్ వర్క్ అందుబాటులో ఉన్నంత మాత్రమే పని చేస్తుంది..
ఈ తరం ఫోన్ లు దేశంలో అంతర్భాగంలో మాత్రమే పని చేస్తాయి..
వేరే దేశంలో పని చేయవు...

 ఫోన్ లోని అసౌకర్యాలు:
ధ్వనిలో నాణ్యత తక్కువ,
బ్యాటరీ జీవితకాలం తక్కువ,
ఫోన్ సైజ్ చాలా పెద్దది...
రక్షణ తక్కువ,
పరిమితమైన సేవలు,
చేతికి అందుబాటులో ఉండదు..

 రెండవ తరం ఫోన్ లు (2 జి నెట్వర్క్): 



ఇవి మొదట ఫిన్ లాండ్ లో 1991 లో కనుగొన్నారు.
ఇవి ఒక రకంగా పాత సెల్ ఫోన్ సెట్స్ అని చెప్పుకోవచ్చు..
ఇవి తక్కువ నాణ్యత కలిగిన డిజిటల్ నెట్ వర్క్స్...
ఇక్కడ సిగ్నల్స్ అనేవి డిజిటల్ రూపంలో ఉండడం వలన కాల్స్ లో నాణ్యత మరియు డాటా ను సులభంగా పంపుకునే విధంగా మారింది... ఇవి సెమి గ్లోబల్ రోమింగ్ సిస్టమ్(GRS) ను కలిగి ఉంటాయి..
ఈ 2G నెట్ వర్క్.. ఉన్న ఫోన్ ప్రపంచంలో నెట్ వర్క్ ఉన్న ఏ దేశంలోనైనా వాడు కోవచ్చు..
దీనికై మనం రోమింగ్ చార్జి చెల్లించవలసి ఉంటుంది...
ఇవి ఒక రకంగా సెల్ ఫోన్ లో మొదటి తరం అని చెప్పవచ్చు..
GSM పద్ధతికి అనుగుణంగా పనిచేస్తాయి..
వీటి వేగం 64 kbps,
వీటిలో మంచి నాణ్యత కలిగిన MMS(Multi media message) ను వాడుకోవడానికి సౌలభ్యం కలిగింది..
అసౌకర్యాలు:
సిగ్నల్ ఉన్నంత వరకు మంచిగా పనిచేస్తాయి..
సిగ్నల్ లేని పరిసరాల్లో నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది..
 వీడియో మెసేజ్ లకు వీలు కుదరదు..

రెండవతరం - మూడవ తరం (2G మరియు 3G మధ్య): 



ఇక్కడ రెండవ మూడవ తరం మధ్యలో ఇంకొక తరం ఉంది.. దానిని 2.5Gఅని చెప్పుకోవచ్చు..
ఇక్కడి నుండే తక్కువ స్థాయి/శక్తి కలిగిన రేడియో తరంగాల ద్వారా ఫోన్ లను పని చేయించడం మొదలు పెట్టింది...
ఇక్కడి నుండే సెల్ ఫోన్ లు జేబులో ఇమిడి పోవడం ప్రారంభమయింది..
ఈ తరం ఫోన్ లు GPRS (సాధారణ పాకెట్ రేడియో సర్వీస్) ను ఉపయోగించుకొనే అవకాశం దక్కింది .. ఫోన్ కాల్స్ తో పాటు, ఇ - మెయిల్స్ పంపుకునే వీలు దొరికింది ..
వెబ్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు,
వేగం-64 నుండి 144KBPS కు పెరిగింది..
కెమేరా నాణ్యత పెరిగింది...
మూడు నిమిషాల Mp3 పాటలను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆరు నుండి తొమ్మిది నిమిషాల సమయం పడుతుంది..

మూడవ తరం (మొబైల్ నెట్వర్క్ల 3 వ తరం): 


ఇక్కడినుండే సెల్ ఫొన్ లతో ఇంటర్ నెట్ వాడు కునే సౌలభ్యం మొదలయింది...
ఇక్కడినుండే సెల్ ఫొన్ లతో ఇంటర్ నెట్ వాడు కునే సౌలభ్యం మొదలయింది... ఈ తరం సెల్ ఫోన్ లు మాత్రమే కాకుండా టాబ్లెట్ లు కూడా మొదలయ్యాయి... డాటా ట్రాన్సిమిషన్ స్పీడు 144KBPS to 2MBPS. దీని వలన ఒకే సమయంలో ఎక్కువ డేటాను వాడు కోవడానికి సౌలభ్యం చిక్కింది... ఇక్కడి నుండే మనకు వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్, ఫైల్ ట్రాన్సిమిషన్, ఇంటర్ నెట్ సర్ఫింగ్, ఆన్ లైన్ టి.వి. , హై ఫ్రిక్వెన్సీ వీడియో, వేర్వేరు రకాలయిన గేమ్స్, ఆడడానికి వీలు కలిగింది.. ఎప్పుడూ ఇంటర్ నెట్ సౌకర్యం అవసరం ఉన్న వారికి 3G సర్వీసు ఒక వరం లాంటిది...వీటినే స్మార్ట్ ఫోన్స్ అంటారు.. ఇక్కడ మూడు నిమిషాల Mp3 పాటలను డౌన్ లోడ్ చేసుకోవడానికి పదకొండు సెకనుల నుండి ఒకటిన్నర నిమిషాల సమయం పడుతుంది.. 


 నాలుగవ తరం ఫోన్ లు (4 వ జనరేషన్ మొబైల్ నెట్వర్క్లు): 

4G అనేది ఒక విధంగా మేజిక్ అని చెప్పవచ్చు... ఇవి మరిన్ని విలువ ఆధారిత సేవలను అందించేందుకు వీలుకుదురుతుంది.. 3G సర్వీసులో కన్నా 4G లో డాటా ట్రాన్స్ ఫర్ ఇంకా చాలా వేగంగా ఉంటుంది.. ఇక్కడ డాటాను 100MBPs to 1GBPS వేగంతో పంపించుకునే సౌలభ్యం దొరుకుతుంది.. అందువలన, ఈ సౌలభ్యాలు కలిగాయి... మొబైల్ మల్టీమీడియా... ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా... ఇంటిగ్రేటెడ్ వైర్ లెస్ , వీడియో కాలింగ్, వాయిస్ చాటింగ్, ఫైల్ ట్రాన్స్ ఫర్, సర్పింగ్, కాన్పరెన్సింగ్, చాటింగ్, నెట్ వర్కింగ్, పార్టీఇంగ్, అన్నీ మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు.. ఒక రకంగా దీనిని మొబైల్ బ్రాడ్ బాండ్ అనవచ్చు... లోపాలు: చాలా ఖరీదైన ఫోన్ సెట్ వాడవలసి ఉంటుంది.. బ్యాటరీ జీవితం చాలా చాలా తక్కువ.. సేవలు అమలు చేయడం చాలా చాలా కష్టం... డెన్మార్క్, నార్వే, స్వీడన్ లలో తప్ప మిగిలిన దేశాలలో ఇప్పుడిప్పుడె మొదలవుతున్నాయి.. అమెరికా, జర్మనీ, స్పెయిన్, చైనా, జపాన్ , మరియు ఇంగ్లాండులోని కొన్ని భాగాలలో వాడుతున్నారు... 

 ఐదవతరం 5G: 

ఇది పూర్తిగా వైర్ లెస్ తో కూడినది... దీనికి హద్దులే లేవు... Wwww(wireless world wide web)కు కూడా సపోర్ట్ చేస్తుంది.. హైస్పీడ్ , హై కెపాసిటి, దీని డే టా ట్రన్స్ ఫర్ వేగం.. gbps లో ఉంటుంది... మల్టీ మీడియా న్యూస్ పేపర్, టి.విప్రోగ్రామ్ లు HD QUALITY తో పుర్తిగా చేతిలో చూడవచ్చు..










ఇప్పుడు రెండు తరాల మధ్య తేడాలు చూద్దాం:



పూర్తిగా 5G సాంకేతికతతో కూడిన జీవితం ఎలాఉంటుంది!! తెలియాలంటే ఈ వీడియో చూడండి:


Post a Comment

Whatsapp Button works on Mobile Device only