Wednesday 26 February 2014

Om Parvat

మిత్రులందరికీ మహ శివరాత్రి శుభాకాంక్షలు
ఓం పర్వతం... 
దీనిని

దీనిని చిన్న కైలాసమని, పిలుస్తుంటారు...ఈ పర్వత గొప్పదనమేమిటంటే, ఈ పర్వతంపై పేరుకున్న మంచు ఓంకార రూపాన్ని సంతరించుకోవడమే...  ఈ పర్వతాన్ని ఈశ్వరుని ప్రతి రూపంగా భావిస్తుంటారు... ఈ పర్వత ముఖ భాగం అంటే Om/ॐ భారత్ వైపు, వెనుక భాగం నేపాల్ వైపు ఉంటాయి... ఇది భరత్, నేపాల్ సరిహద్దులలో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది...  అందుకే పర్వతం దగ్గరకు వెళ్ళాలంటె తప్పనిసరిగా రెండు దేశాల అనుమతి తీసుకోవలసి ఉంటుంది..
ఈ పర్వతానికి ముందు భాగంలో పార్వతీ సరస్సు, Jonglingkong సరస్సులు ఉంటాయి.. Jonglingkong సరస్సును మానససరోవర సరస్సుకు ప్రతిరూపంగా భావిస్తుంటారు..
కైలాస మానస సరోవర యాత్ర జరిపే యాత్రికులు ఈ పర్వతాన్నితప్పని సరిగా దాటి వెళ్ళవలసి ఉంటుందట...
ఈ పర్వతం యొక్క ఎత్తును ఖచ్చితంగా నిర్థారించబడలేదు సుమారు 5950 మీ. ఉంటుందని ఒక అంచనా
 ॐ రూపాన్ని చూడాలంటే ఫితోరాఘర్, ఉత్తరాఖండ్ వెళ్ళాలి...
ఈ టపా చూస్తున్న వారికందరికీ ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు...



Post a Comment

Whatsapp Button works on Mobile Device only