Thursday 27 February 2014

నిజమైన ప్రేమంటే మంచివాళ్ళని ప్రేమిచడం మాత్రమే కాదు,దుర్మార్గులని కూడ ద్వేషించకుండా ఉండగలగడం.- Motivational story

పూర్వం ఒకానొక ఊరిలోరాధ తన ఒక్కగానొక్క కొడుగుహేమంత్ తో జీవించసాగింది.... తండ్రి లేని పిల్లాడవటం వలన  హేమంత్ కొంచెం గారాబంగా పెరిగాడు... దానినుండే అతనికి చిరాకు, కోప స్వభావాలు అలవడ్డాయి...... ప్రతీ దానికి చిర్రు బుర్రు లాడుతూ అందరినీ ద్వేషిస్తూ అందరితో గొడవపడుతూ, అందరి దగ్గర కోపిష్టి అనే పేరు తెచ్చుకుంటాడు... హేమంత్ వాళ్ళ అమ్మ రాధ కు అతని మీద చాల దిగులు పట్టుకుంటుంది.. వీడిని ఎలా మార్చాలి అని చాలా రోజులు బాధ పడుతూ ఉంటే రాధ తల్లి.. రాధా! నీవు దిగులు పడకు వాడిని నా దగ్గరకు పంపించు వాడికి తగిన బుద్ధులు నేర్పి పంపుతాను.. అని నచ్చ చెప్పి కొన్ని రోజులు తన దగ్గర ఉండే విధంగా తగు ప్రణాళిక వేసుకుని తన దగ్గరకు వచ్చిన హేమంత్ కు రోజూ మంచి మంచి కథలు చెపుతూ..దానిలో భాగంగా హేమంత్ చాలా మంది నీకు కోపం తెప్పిస్తున్నారని నీవు భావిస్తున్నావు కదా.. ఏరోజయినా నీకు ఒకరి మీద కోపం వచ్చిందనుకో ఒక బంగాళాదుంప నీ సంచిలో వేసుకో అలా ఎన్ని రోజులయితే అన్ని వేస్తూ పోతూ ఉండు..ఒక అద్భుతం సంభవిస్తుంది ... నీవు భరించలేని స్థితిలో నా దగ్గరకు రా అని చెపుతుంది... హేమంత్ కు బామ్మ అంటె చాలా చాలా ఇష్టం... అందుకే ఇదేదో బావుంది.. అని అనుకుని... బామ్మ చెప్పినట్లు చేయసాగాడు... కొన్ని రోజులకు అర్ధమయిందిఅది ఎంత దారుణంగా ఉందొ... కంపును భరించలేక, బరువు మోయ లేక.. అతని నుండి వచ్చే వాసనకు చుట్టు పక్కల వారు అతనిని దూరంగా ఉంచటం భరించలేక చివరికి మళ్ళీ బామ్మ దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం చెప్పి బాధ పడతాడు.. అందుకు బామ్మ హేమంత్ నీవు నీ చుట్టు పక్కల వారి మీద పెంచుకునే ద్వేషం పాడై పోయిన ఆలుగడ్డ లాంటిదే... ఎంత ఎక్కువ మందితో ద్వేషం పెంచుకుంటె అంత ఎక్కువ దుర్వాసన వస్తుంది.. దుర్వాసన అనేది నీవు ఇతరులతో నెరపే సంబంధం లాంటిది.. ఎంత ఎక్కువ మందితో నీ సంబంధాలు బెడిసికొడితే అంత ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి.. ” మనం ఎవరిని అయినా ద్వేషించినప్పుడు అది మన హృదయం అంతా వ్యాపిస్తుంది .వారం రోజులు దుర్వాసన భరించడమే కష్టం అయినప్పుడు జీవితాంతం భరించాలంటే ఎలా ఉంటుందో అలొచించండి. జీవితాన్నించి ద్వేషాన్ని దూరం చెసుకుంటే జీవితం అంతా పాపాలు మొయ్యక్కర్లేదు
అలా చేయక పోతే  ఎవరూ నీతో స్నేహం చెయ్యటానికి రారు.. ఒంటరివై పోతావు.. జాగ్రత్త పడు.. లేకపోతే నీ ఇంకా ఎక్కువ బాధ పడవలసి వస్తుంది.. అని చెబుతుంది...
విషయం అర్ధమయిన హేమంత్ తర్వాతి నుండి బుద్ధిమంతుడవుతాడు...
నీతి: నిజమైన ప్రేమంటే మంచివాళ్ళని ప్రేమిచడం మాత్రమే కాదు,దుర్మార్గులని కూడ ద్వేషించకుండా ఉండగలగడం.


Whatsapp Button works on Mobile Device only