Friday 22 October 2021

Atla Taddi festival significance information greetings wishes images in telugu free download pdf - అట్ల తద్ది ఎలా చేసుకోవాలి... ఎందుకు చేసుకోవాలి

మనము మర్చిపోతున్న పండుగలు - అట్లతద్ది

Atla Taddi pooja vidhi - అట్ల తద్ది ఎలా చేసుకోవాలి... ఎందుకు చేసుకోవాలి ఈ రోజు అట్లతద్ది.. అట్లతద్దిలో జరిగే ప్రతి కార్యక్రమము బాలికలకు మరియు స్త్రీలకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలను తొలగించే విధంగా ఉంటుంది... అలా మన పూర్వీకులు ఈ పండుగను డిజైన్ చేసారు అనడంలో ఎలాంటి సందేహం లేదు... అట్ల తద్ది రోజున ఏమేం చేయాలి... బాలికలు చేయవలసినవి.. పెళ్ళైన స్త్రీలు చేయవలసినవి.. (ఏఏ విధులు నిర్వర్తించాలి.. ఏ స్తోత్రం/పూజ చేయాలో) ఈ పోస్ట్ ఉంచాము...

త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం.ఐదేళ్ల దాటిన బాలికల నుంచి పంముత్తైదువుల వరకు ఈ అట్లతద్ది చేసుకుంటారు.ఈ పండుగ కేవలం దక్షిణ భారతంలో మాత్రమే కాదు... ఉత్తర భారతదేశంలో కూడా ఈ పండుగను కార్వా చౌత్ అనేపేరుతో చేసుకుంటారు....

ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం.
రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది.

ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమయినది. పిల్లలు , పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు జామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీదేవి పూజ చేసి , ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు , 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని , శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం , 11 తాంబూలం వేసుకోవడం , 11 ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి , ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.

సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల భార్యలు సరస్వతి , లక్ష్మి , పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా , పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతున్నాయి పురాణాలు.

పెళ్ళైన స్త్రీలు అట్లతదియ రోజున అనుకూల దాంపత్యం కొరకు పఠించవలసిన 
>>>అర్థనారీశ్వర స్తోత్రం <<<click here 


|Atla tadde Date and time - 2021|
అట్ల తద్దె 2021 తేదీ - శనివారం, అక్టోబర్ 23, 2021
తదియ తిథి ప్రారంభమవుతుంది - అక్టోబర్ 23, 2021 న 12:29 AM
తదియ తిథి ముగుస్తుంది - 03:01 AM అక్టోబర్ 24, 2021 న
సర్వేజనాః సుఖినోభవంతు - శుభమస్తు
-------------------------------------------------------------
_గోమాతను పూజించండి_
_గోమాతను సంరక్షించండి_


మరిన్ని హిందూ పండుగల విశేషాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


Here is Atla taddi greetings wishes images in telugu, Karwa chaut telugu hindu festival Atla tadde wishes and images in telugu, Telugu festival atla taddi information in telugu, atla taddi greetings messages in telugu language, Telugu 2021 Happy Atla Taddi Greetings Wishes Messages Quotes Images, Here is a Atla Taddi Telugu Greetings and Celebrations Photos, Atla Taddi Date in 2018 is 23th october saturday, Atla Taddi Story in Telugu, Atla Taddi Vartha Katha, Best Atla Tadde Paintings and Quotations, Telugu Atla Tadde Wishes Wallpapers, Latest Telugu language Atla Tadde Songs and Messages, Telugu Atla Tadde Story and Quotations, Telugu 2018 Atla Tadde Messages for All, Atla Tadde Love Quotations in telugu, Telugu Atla Tadde Andhrapradesh, Telangana Quotations, Telugu Ammayi Atla Tadde Wishes.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only