Friday 29 August 2014

ఆడవాళ్ళ నోటిలో నువ్వు గింజ కూడా నానకూడదు అనే నానుడి వెనుక ఉన్న కథ :::::

ఆడవాళ్ళ నోటిలో నువ్వు గింజ కూడా నానకూడదు అనే నానుడి వెనుక ఉన్న కథ:::::
కుంతీ దేవి కథ ద్వారా మనం నేర్చుకోవలసినది ఎంతో ఉంది
కన్యాగర్భం ఎంత ప్రమాదమో మహా భారతం మనకు నేర్పుతుంది...
భారతంలో లేని కథ లేదు..
ఈ భూప్రపంచంలో ఏ ఒక్కరి కథను చూసినా దానికి సంబంధించిన ఏదో ఒక మూలం మనకు మహాభారతంలో కనపడుతుందట..
నాలుగు వేదాల సారం ఇందులో కనపడుతుంది కాబట్టే భారతాన్ని పంచమ వేదం అంటారు... మహాభారతంలోని కుంతీ దేవి పాత్ర చాలా చాలా గొప్పది. మొత్తం మహాభారత కథ కుంతీ దేవి చుట్టూ నడుస్తుందని కూడా చెప్పవచ్చు.. దుర్వాసమునికి చేసిన శశ్రూషలకు మెచ్చి ముని కుంతీ దేవికి ఒక వరమిస్తాడు...
అది ఏమిటంటే తన ఇష్టమైన దైవ అనుగ్రహంతో కన్యత్వానికి భంగం కలుగకుండా కుమారుడిని పొందగలిగే మంత్రం..
 ఒక రోజు ఈ మంత్ర ప్రభావం ఎలాఉందో పరీక్షించదలచి మంత్రం జపించి సూర్యదేవుని వేడుకుని.. సూర్యుని అనుగ్రహం వలన కర్ణుడిని పొందుతుంది... అప్పటికి కుంతీ దేవికి వివాహం కాదు.. అందువలన కన్యాగర్భం తనకు అవమానాలను మిగిలుస్తుందని భయపడి.. సహజకవచకుండలాలతో జన్మించిన కర్ణుడిని ఒక పెద్ద పెట్టెలో ఉంచి రత్న, మణిమాణిక్యాలతో గంగానదిలో వదిలివేస్తుంది..
 1. కర్ణుడి విషయం పాండు రాజు దగ్గర దాచి ఒక అపరాధం చేస్తుంది... వివాహం ముందు పుట్టినా సరే ధర్మం రీత్యా కర్ణుడిని పాండురాజు కొడుకుగా ఆదరించేవాడే...
2. యుద్ధం జరిగేటపుడు కర్ణుడితో పాండవులను సంహరించవద్దు అని ప్రాధేయపడుతుంది.. అందుకు కర్ణుడు అర్జునుడు తప్ప మిగిలిన వారిని వధించను.. తను/అర్జునుడు ఎవరో ఒకరు మాత్రమే మిగులుతారని.. చివరికి పంచపాండవులు మాత్రమే మిగులుతారని అభయమిస్తాడు... ఇపుడు కూడా ఈ విషయం ధర్మరాజు కు చెప్పదు కుంతి.. ఒకవేళ చెపితే ధర్మరాజు అన్నగా తనను అంగీకరించేవాడే, మరియు రాజ్యానికి పట్టాభిషేకం చేయించేవాడే ....
 3. చివరికి యుద్ధంలో కర్ణుడు మరణిస్తాడు.. యుద్ధంలో మరణించిన వారికి ధృతరాష్ట్రుడు.. ధర్మరాజు ఎవరికి సంబంధించిన వారు తమ వారికి పిండప్రథానాలు చేస్తే కర్ణుడికి ఎవరూ పిండప్రధానం చేయరు.. ఇందుకు కూడా కుంతి చాలా దుఃఖిస్తుంది.. అప్పుడు ధర్మరాజు ముందు బయట పడుతుంది కర్ణుడు తన కుమారుడని.. జరిగిన అన్ని అనర్థాలకు బాధపడిన ధర్మరాజు.. ఆడవారి నోటిలో ఏ రహస్యందాగదని.. చివరికి నువ్వుగింజనానినంత సమయం కూడా పట్టకూడదని శాపమిస్తాడు..
Conclusion:ఒక విధంగా కుంతీ దేవికి/ఆడవారికి కూడా ఇది శాపమని చెప్పవచ్చు.. కుంతీ దేవి వలన మొత్తం యావత్ ఆడవారికి ఈ శాపం వచ్చింది.. మన యువతరానికి ముఖ్యంగా అమ్మాయిలకు కుంతీ దేవి చరిత్ర/మహాభారత కథను చెప్పవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది.. వేలంటైన్ డేలు, డేటింగులు లాంటిదినాలతో వచ్చే అనర్థాలు..వాటి దుష్ప్రభావాల గురించి మనకు కుంతీ దేవి కథ ద్వారా మహాభారతం హెచ్చరించిందని చెప్పవచ్చు... ఈ డేటింగులు/వేలంటైన్ డేలు మనసంస్కృతి కాదు

Post a Comment

Whatsapp Button works on Mobile Device only