![]() |
| Independence day ,1947 |
1. మొదటి జాతీయ పతాకం ఎగురవేసింది August 7, 1906 లో అయితే ఈ పతాకం ఎరుపు,పసుపు, ఆకుపచ్చ వర్ణాలను కలిగిఉండి.. ఎర్ర చార నిండా ఎనిమిది తెల్లని కలువపూలను..మధ్యలో పసుపు చార, క్రింది భాగంలో ఆకు పచ్చ చార ఉండేవి.. ఆకు పచ్చ చారలో కుడి చేతి క్రింది భాగంలో నక్షత్రం.. ఎడమ చేతి భాగంలో ఉదయిస్తున్న సూర్యుడు గుర్తు ఉండేదని సమాచారం..
2. ప్రస్తుత పతాకాన్ని పోలిన మొట్ట మొదటి జాతీయ పతాకాన్ని రూపొందించింది పింగళి వెంకయ్య గారు,1921లో విజయవాడలో... ఆ సమయాన పతాకంలో రెండు రంగులే ఉండేయట అవి కాషాయం మరియు ఆకుపచ్చ.. ఇవి రెండు మతాలకు చెందిన వర్ణాలు... కానీ గాంధీ గారి సలహా మేరకు మధ్యలో తెలుపు రంగును అశోక చక్రాన్ని పతాకంలో కలిపి ఆవిష్కరించారట..
3. మనతో పాటు స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకునే దేశాలు ఉత్తరకొరియా , దక్షిణ కొరియా, బహ్రెయిన్ మరియు కాంగో దేశాలు.. అవును ఈ దేశాలన్నీ August 15 నే స్వాతంత్ర్యాన్ని పొందాయి... మనకు స్వాతంత్ర్యం వచ్చే సమయానికి కొరియాకు రెండు సంవత్సరాలు అయిందట స్వాతంత్ర్యం వచ్చి... అందుకే లార్డ్ మౌంట్ బాటన్ అలా సెట్ చేసి ఇచ్చారట..
4. భారత జాతీయ పతాకాన్ని తయారు చేసే అధికారం కేవలం ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ వారికే స్వంతం. భారత దేశంలోని అన్ని జాతీయ పతాకాలను వారు మాత్రమే అందిస్తారు...
5. ప్రపంచంలోని అత్యధికులు ఆహారంగా ఉపయోగించే, వరి, గోధుమ, చెరకు, మొక్కజొన్న, పాలు,టీ, కాఫీ, మామిడిపండ్లు లాంటి ఉత్పత్తులు మన దేశంలోనే అత్యధికంగా లభిస్తాయి...
6. ప్రపంచంలోని అత్యధిక రోడ్డు నెట్ వర్క్ కలిగిన దేశం మనదే... 1.9 million miles
ప్రపంచంలోని అత్యంత వర్షపాతం కలిగి ఉన్న ప్రదేశం చిరపుంజి, దక్షిణ అమెరికా లోని ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ కన్నా ఇక్కడ అయిదు రెట్ల అధిక వర్షపాతం(425 అంగుళాలు) ఉంటుంది...
7.ప్రపంచంలో అతిఎక్కువ పోస్టాఫీసులు కలిగి ఉన్నది మన దేశమే....155,618 post offices 5,66,000 సిబ్బందిని కలిగి ఉంది... ప్రపంచంలో అత్యంత పెద్దదైన పోస్టల్ నెట్ వర్క్ మనదేశంలోనే ఉంది..
8. అందరూ అనుకుంటున్నట్లు భారత జాతీయ భాష హిందీ కాదు.... అది భారతదేశ అధికారభాష మాత్రమే... ఇంకా 22 భాషలను అధికారభాషలుగా పరిగణించారు.. వీటిలో హిందీను మొట్టమొదటగా September 14, 1949 న ఆమోదించారు...
మన జాతీయగీతం జనగణమన ను వ్రాసింది 1911లోనే అయినా August 15, 1947 న అది జాతీయ గీతంగా ప్రకటించబడలేదు... 1950 లో దానిని జాతీయ గీతంగా ప్రకటించారు.
9. జనగణమనఅధినాయక జయహే గీతంలో ‘భారతభాగ్యవిధాత’ అనే ప్రాంతంలో కింగ్ జార్జ్-అయిదు ఉంచమని బ్రిటిషు వారు కోరిన వినతి ని రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారట...
10. ప్రపంచంలో చాలా ఎక్కువ బ్రాంచీలు (15,000)కలిగి ఉన్న సంస్థ/బ్యాంకు.. భారతీయ స్టేట్ బ్యాంకు
11. ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగులు/సిబ్బంది పనిచేస్తున్న సంస్థ... భారతీయ రైల్వే
12. సూపర్ కంప్యూటర్ తయారుచేయగల మూడు దేశాలలో(అమెరికా,జపాన్ మిగిలిన రెండు)మన దేశం మొదటిది..
13. ప్రపంచంలోని అతి పెద్ద ప్లాన్ డ్ టౌన్ షిప్ నవీముంబై.. ఇది 1972 లో నిర్మితమైనది
14. భారతదేశంలో నిర్మించబడేన్ని సినిమాలు ఏ ఇతర దేశాలలోనూ నిర్మించబడవు... ప్రపంచంలోని అతి పెద్ద సినిమా ఇండస్ట్రీ మనదే.. (బాలీవుడ్)
15. భారతదేశంలో 3,00,000 మసీదులు ఉన్నాయి.. ఏ ఇతర దేశంలో చివరికి ముస్లిం దేశంలో కూడా ఇన్ని మసీదులు లేవు...
![]() |
| Independence day ,1947 |
![]() |
| Independence day ,1947 |
![]() |
| Independence day ,1947 |
![]() |
| Independence day ,1947 |




Post a Comment