Wednesday 21 August 2019

Who is great... Davinci or Jakkanna

ఇది మన దేశ చరిత్ర, దీని గొప్పతనాన్ని తెలుసుకొండి
ఎవరు గొప్ప???
పాశ్చాత్యులు కళ్ళు తెరువక ముందే... విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో ... డ్రిల్ బిట్ లేకుండా ఇంత అద్భుతాన్నీ సుసాధ్యం చేసిన మన అమరశిల్పి జక్కన్న నిజంగా చరితార్థుడే.... అవును అమర శిల్పి జక్కన చెక్కిన శిల్పమిది. జక్కన ఎందుకు అమరశిల్పి అయ్యాడో ఈ శిల్పాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక చిన్న పొరపాటు జరిగినా చెక్కిన శిల్పం అంతా వృథా అయిపోయే శ్రమ తీసుకుని, పొరపాటు కు తావు లేకుండా కొన్ని వందల కొద్దీ శిల్పాలు ఎలా చెక్కగలిగారో ఆరోజుల్లో... … అవి కూడా ఇంకెవరికీ అనుకరించడానికి కూడా వీలు లేనంత అద్భుతంగా చెక్కిన ఆ మహానుభావుని మేథస్సు, సాధన, కళా నైపుణ్యం…అనిర్వచనీయం... మనకు తెలిసినంత వరకు ఒక శిల్పం అంటే… ఒక దేవతా మూర్తి అవయవాలన్నీ సక్రమంగా రూపొందించి చుట్టూ ఒక ఆర్చి లాంటిది పెట్టేస్తే సరి… ఇక శిల్పం పూర్తయినట్టే. హలేబీడు , బేలూరు లోని శిల్ప సంపదను చూస్తే అవి ఒక్క అంగుళం కూడా వదలకుండా లతలు, అల్లికలతో, విచిత్రమైన డిజైన్లతో నిండి ఉండడం స్పష్టంగా చూడవచ్చు. ఆ స్త్రీ మూర్తుల మెడలో అలంకరించిన హారాలు, చెవి రింగుల్లోని పూసలతో సహా… చేతి వేళ్ళకు వుండే గోళ్ళను, ఆఖరికి జుట్టు కొప్పులోని వెంట్రుకలను కూడా శిల్పంలో స్పష్టంగా చూపించడం అంటే… మనుషులకు ఎవరికైనా సాధ్యమయ్యే పనే కాదు... 2mm, 3mm, Drill Bits తో కూడా సాధ్యంకాని ఆ శిల్పకళ... దేవలోకంలో నివసించే ఏ యక్షుడో, గంధర్వుడో శాపవశాన ఇలా కొన్నాళ్ళు భూమిపైకి వచ్చి…ఇలా సృష్టించాడా అనిపిస్తుంది.. ఇలాంటి వాడు ఒకడు ఈ భూమిపై, ఈ మనుషుల్లో కలిసి తిరిగాడని మనం నమ్మడానికి గుర్తుగా ఈ శిల్పాలు చెక్కి వెళ్లిపోయాడని మనస్ఫూర్తిగా నమ్మ వచ్చు కదా. మొనాలిసా అనే చిత్రాన్ని అడ్డం పెట్టుకుని పాశ్చాత్యులు డావిన్సి గురించి ప్రపంచమంతా ప్రచారం చేసుకుంటున్నారు.... సినిమాలు తీస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు… 

Davinci Vs Jakkanna

Post a Comment

Whatsapp Button works on Mobile Device only