Wednesday 24 October 2018

Interesting facts in Telugu-1

Interesting facts - 1
మన ప్రత్యక్ష భగవానుడు.. సూర్యుడు
భూమి మీద నివసించే ప్రతి జీవి సూర్యుని నుండే శక్తి ని పొందుతుంది అనేందుకు ఎటువంటి సందేహం లేదు.. అయితే మన సూర్యుడు మన పాలపుంత లోని ఒక నక్షత్రం మాత్రమే... పాలపుంతలో సూర్యుని లాంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయని తెలుసు... పాలపుంతను ఆంగ్లములో గెలాక్సీ అని అంటారు.. తదితర అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన మన పాలపుంత వైశాల్యం రమారమిగానైనా ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతాం. దీని సరిహద్దును దాటడానికి కాంతివేగంతో ప్రయాణించే వ్యోమనౌకకు సుమారు 2 లక్షల కాంతి సంవత్సరాల సమయం పడుతుందన్నది తాజా అంచనా.

భూమిని ఆవాసంగా చేసుకున్న మన నక్షత్రవీథి పాలపుంత (మిల్కీవే) చుట్టుకొలత (వైశాల్యం) ఎంత? కాంతివేగంతో ప్రయాణించే ఒక వ్యోమనౌక ఎన్నాళ్లకు దానిని దాటేసి మరో గెలాక్సీ (నక్షత్రవీథి) బాట పడతుంది? వామ్మో...ఎంత గొట్టు ప్రశ్నో కదా. దీనికి రమారమి సమాధానం కనుగొనే ప్రయత్నమైతే చేస్తున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఇదివరకు అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువ దూరం వున్నట్టు తాజాగా వారొక నిర్ధారణకు వచ్చారు. కాంతివేగంతో ప్రయాణించే వ్యోమనౌక (నిర్మిస్తేనే సుమా) పాలపుంతను దాటడానికి పట్టే కాలం దాదాపు 2,00,000 కాంతి సంవత్సరాలు. గత అంచనా మేరకు ఆ వ్యోమనౌకకు సుమారు 1,00,000 నుంచి 1,60,000 కాంతి సంవత్సరాల సమయం పట్టేది. కానీ, ప్రస్తుత పరిశోధనల్లో అది పెరిగింది అని వారు ప్రకటించారు. కాంతి ఒక ఏడాది కాలంలో ప్రయాణించే దూరం సుమారు 6 ట్రిలియన్ మైళ్లు లేదా 10 ట్రిలియన్ కిలోమీటర్లు. అస్ట్రానమీ అండ్ అస్ట్రోఫిజిక్స్ ఆన్‌లైన్ జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది.
Interesting facts in Telugu-1
Interesting facts in Telugu-1

Post a Comment

Whatsapp Button works on Mobile Device only