Sunday 25 January 2015

రథసప్తమి విశిష్టత :: ఆరోగ్య కారణాలు :: ఆధ్యాత్మిక కారణాలు:: శ్లోకం::Rathasaptami-Festival

రథసప్తమి విశిష్టత :: ఆరోగ్య కారణాలు :: ఆధ్యాత్మిక కారణాలు::
చాలావరకు మన పండుగలన్నీ వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా ఏర్పడుతాయి.. రథ సప్తమికి వాతావరణ పరంగా కూడా ప్రాధాన్యం ఉంది.. సూర్యుడు మకర రాశిలో అడుగు పెట్టిన అనంతరం వాతావరణంలో వేడి ప్రారంభమవుతుంది అనుకున్నాం కదా.. అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది... శీతాకాలం నుండి వేసవి కాలపు సంధి స్థితిలో వచ్చే పండుగ ఇది.. అందుకే ఈ పండుగ వసంత, గ్రీష్మ ఋతువుల మధ్యలో వస్తుంది..
బ్రహ్మ సృష్టిని ప్రారంభించే టపుడు తూర్పు దిక్కునే ముందుగా సృష్టిస్తాడట.. సూర్యుడు ఏడు గుర్రాల మీద రథమెక్కి కర్మ సాక్షిగా బాధ్యతలు స్వీకరించాడట.. సూర్యునికి సంబంధించినంతవరకు ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. సూర్యుని రథంలో ఉన్న అశ్వాల సంఖ్య ఏడు... వారంలో రోజులు ఏడు.. వర్ణంలో రంగులు ఏడు.... అలా తిథులలో ఏడవది అయిన సప్తమి రోజు అందునా మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఏడు రథాలతో తన గమనాన్ని మొదలెడతాడట... దీనికి సూచనగా రథ సప్తమి నాడు రాత్రి నక్షత్ర మండల ఆకారం ఒక తేరు రూపాన్ని సంతరించుకుంటాయట..
Happy Ratha Saptami Telugu Greetings Shlokam
Happy Ratha Saptami Telugu Greetings Shlokam

ఈ రోజున ప్రాతః కాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన ఆర్క పత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని స్నానంచేస్తే చాలా మంచిదని చెప్తారు.. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యమేమంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి.. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి.. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది..అనేక చర్మ రోగాలను నివారిస్తుంది..
జననీ  త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే,
సప్తమ్యా హ్యదితే దేవి సమస్తే సూర్యమాతృకే
అనే మంత్రంతో స్నానం చేయాలి..
శ్రీరాముల వారంతటి వారే ఆదిత్య హృదయాన్ని పఠించి రావణవథకు బయలుదేరారట..
సూర్యునికి ఇష్టమైన ఈ పండుగ రోజున పై మంత్రాన్ని పఠించి సూర్యుని పూజించి ఆర్ఘ్యం ఘటించి... మన భక్తి ప్రపత్తులు చాటుకుందాం!!!
షష్టి సప్తమి జంటతిథులు కలగలసిన వచ్చిన రథసప్తమి రోజు చాలా విశిష్టమైనది.. అలా ఈ సంవత్సరం వచ్చింది.. రేపు ఉదయం దాకా సప్తమి ఘడియలు ఉన్నాయి.. కాబట్టి ఈ రోజు అవకాశం దొరకని వారు కనీసం రేపైనా సూర్యునికి అంజలి ఘటించి నమస్కరించండి!!
మిత్రులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు!!

Ratha Saptami రథసప్తమి images wallpapers wishes శ్లోకం

Post a Comment

Whatsapp Button works on Mobile Device only